»   » రెమ్యున రేషన్ కోరని తెలుగు హీరో:ఇంత ఫ్యాషన్ ఉన్నవారు అరుదే కదా

రెమ్యున రేషన్ కోరని తెలుగు హీరో:ఇంత ఫ్యాషన్ ఉన్నవారు అరుదే కదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా కథానాయకులైనా .. కథానాయికలైనా తమకి గల క్రేజ్ ను బట్టి, పారితోషికాన్ని తీసుకుంటూ వుంటారు. అయితే తమకి ఎంతో ఇష్టమైన పాత్రను పోషించే అవకాశం వచ్చినప్పుడు, తమ పారితోషికం విషయాన్ని కూడా పక్కకి పెట్టేస్తుంటారు. ఆ పాత్రను పోషించి సంతోష పడుతుంటారు. సంతృప్తి చెందుతుంటారు. ప్రస్తుతం హీరో సందీప్ కిషన్ అదే చేస్తున్నాడు.

"పారితోషికానికి నేను ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు. మంచి సినిమాలో భాగమైతే చాలనుకొన్నా. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలకి తప్ప ఇదివరకు చేసిన ఏ సినిమాకీ పారితోషికం తీసుకోలేదు. నచ్చిన సినిమా చేయాలనుకొన్నప్పుడు డబ్బుల గురించి పట్టించుకోకూడదనేది నా సిద్ధాంతం.

sandeep

అందుకు అనుగుణంగానే ప్రయాణం చేశాను. ఇక నుంచి నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం. ఇదివరకు హిందీ, తమిళంలో సరదాగా నటించాను".అంటూ ఇదివరలో కూడా సందీప్ చాలాసార్లే చెప్పాడు. అయితే అప్పట్లో నటన మీద ఎంత ఇష్టం తో పని చేసాడో ఇప్పుడూ అంతే ఇష్టం తో ఉన్నాడు.

డబ్బుసంపాదనే కాదు పని చేయటం అంటే మన జీవితాన్ని ఎంజాయ్ చేయటం అన్నట్టు బతకటం అందరికీ సాధ్యం కాదు. నిత్యామీనన్ తో కలిసి సందీప్ కిషన్ చేసిన తాజా చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా సినిమా గురించి చెబుతూ సందీప్ కిషన్ ప్రసక్తి వచ్చినప్పుడు ఈ సినిమాకి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదన్న విశయాన్ని బయట పెట్టాడు దర్శకుడు రాజ సింహ అప్పటి నుంచి ఈ సినిమాను పూర్తిచేసేంత వరకూ ఆయన ఎంతో ఆరాట పడ్డాడని చెప్పాడు. లాభాలు వస్తే తీసుకుంటానని చెప్పి, ముందుగా పారితోషికం కూడా తీసుకోకుండా ఆయన పనిచేశాడంటూ అభినందించాడు.

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది సందీప్ కిషన్ మేనమామ అయిన చోటా కే నాయుడు కూడా ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా హిట్ అయి లాభాలొస్తే ఆ లాభలని బట్టే మాకు రెమ్యునరేషన్ ఇవ్వండీ అని చెప్పారట ఈ మామా అళ్ళుల్లు

English summary
Hero Sundeep Kishan Not Taken Remuneration for his New Movie Okka Ammaayi Tappa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu