»   » తప్పుడు ప్రచారం...సందీప్‌ కిషన్ హర్టయ్యాడు

తప్పుడు ప్రచారం...సందీప్‌ కిషన్ హర్టయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పోలీసులకు చిక్కారంటూ....మీడియా వారు వేరే వారి ఫోటో బదులు తన ఫోటో చూపుతూ న్యూస్ ని ప్రచారం చేస్తున్నారని సందీప్ కిషన్ ఫీలవుతున్నారు. ఈ విషయమై మరింత భాధ్యతగా వ్యవరించాలని మీడియా వారికి సూచిస్తూ ట్వీట్ చేసాడు. జై బోలో తెలంగాణ సినిమా హీరో సందీప్‌ ... మద్యం సేవించి దొరికితే సందీప్ కిషన్ అనుకుని విజువల్స్ చూపటంపై ఆయన మండిపడుతున్నారు. అలాగే....గతంలోనూ డ్రగ్ కేసు పట్టుబడినప్పుడు తన ప్రస్దానం లో సన్నివేశాలు చూపారని, తన ఇంట్లో వారు కంగారుపడుతున్నారని ఆయన అన్నారు.

మద్యం సేవించి వాహనం నడుపుతూ ఓ సినీ హీరో పోలీసులకు చిక్కారు. జూబ్లీహిల్స్‌లో శుక్రవారం రాత్రి తనిఖీల్లో భాగంగా జై బోలో తెలంగాణ సినిమా హీరో సందీప్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో అతనిని పరీక్షించగా మద్యం సేవించినట్లు తేలింది. ఈక్రమంలో అతనిపై కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. మద్యం పరీక్షల్లో పట్టుబడిన మరికొందరిపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొన్ని టీవీ ఛానెల్స్ ..పొరపాటున సందీప్ కిషన్ ఫొటోతో ఈ న్యూస్ ని ప్రసారం చేసాయి.

Sundeep Kishan offended by incorrect news

ప్రస్తుతం ఆయన 'రారా కృష్ణయ్య'తో పాటు కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ... నటుణ్ణి కాకముందు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. అలా అని ఇప్పుడు డైరెక్షన్ మీద ఎలాంటి ఆసక్తీ లేదు. కానీ ప్రొడక్షన్‌లోకి వస్తా. ఎందుకంటే సినిమాకి మించి నాకేమీ తెలీదు. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని ఉంది. బన్ని (అల్లు అర్జున్) చేసే పాత్రలు నాకు ఇష్టం. 'ఆర్య', 'జులాయి', 'జగడం' అన్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Act a lil more responsible pls..when the drug racket came out they started using visuals from Prasthanam..atleast mention below pls</p>— Sundeep Kishan (@sundeepkishan) <a href="https://twitter.com/sundeepkishan/statuses/477693262359048192">June 14, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

రెమ్యునేషన్ గురించి మాట్లాడుతూ... ''పారితోషికానికి నేను ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు. మంచి సినిమాలో భాగమైతే చాలనుకొన్నా. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలకి తప్ప ఇదివరకు చేసిన ఏ సినిమాకీ పారితోషికం తీసుకోలేదు. నచ్చిన సినిమా చేయాలనుకొన్నప్పుడు డబ్బుల గురించి పట్టించుకోకూడదనేది నా సిద్ధాంతం. అందుకు అనుగుణంగానే ప్రయాణం చేశాను. ఇక నుంచి నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లడమే నా ముందున్న లక్ష్యం. ఇదివరకు హిందీ, తమిళంలో సరదాగా నటించాను. మళ్లీ అక్కడ సినిమా చేయాలంటే ముందు తెలుగులో మరొక విజయాన్ని అందుకోవాలి''. అన్నారు.

తన తాజా ప్రాజెక్టుల గురించి చెప్తూ... ''చేసే ప్రతీ సినిమా కూడా కొత్తదనాన్ని పంచాలనుకొంటాను. ఓ ప్రేక్షకుడిగానే కథని విని ఎంపిక చేసుకొంటుంటాను. త్వరలో రానున్న 'రా రా కృష్ణయ్య' ఓ వైవిధ్యమైన చిత్రం. నేను చేస్తున్న తొలి ప్రేమకథ కూడా ఇదే. కథానేపథ్యం కొత్తగా ఉంటుంది. 'గుండెల్లో గోదారి' దర్శకుడు కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. అది కూడా చివరి దశకు చేరుకొంది. ఇదివరకు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేవాణ్ని. తదుపరి అవకాశం ఉంటుందో లేదో అని భయపడుతూ అలా ఒప్పుకొనేవాణ్ని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఒక సినిమా తర్వాతే మరొకటి చేయాలని నిర్ణయించుకొన్నా. అప్పుడే పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి వీలవుతుంది'' అన్నారు.

English summary
Sandeep Kishan tweeted: “Act a lil more responsible pls..when the drug racket came out they started using visuals from Prasthanam..atleast mention below pls. Especially don’t want my family getting calls in the morn..m a responsible citizen & will always remain so..request u to b specific pls,thnx”, said the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu