»   » సందీప్ కిషన్ హిట్టు కొట్టేట్టే ఉన్నాడు (రన్ ట్రైలర్)

సందీప్ కిషన్ హిట్టు కొట్టేట్టే ఉన్నాడు (రన్ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్‌ కిషన్‌, అనీషా అంబ్రోస్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్‌'. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి, కిషోర్‌ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం 'నేరం' రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎ.ఎమ్.రత్నం, దర్శకుడు అని కన్నెగంటి, అనీల్ సుంకర, వీరుపోట్ల, కాశీవిశ్వనాథ్, అల్లరి నరేష్, జి.నాగేశ్వరరెడ్డి, జెమిని కిరణ్, వి.ఆనంద్, శ్రీని అవసరాల, రాజ్ తరుణ్, కె.దశరథ్, క్రాంతి మాధవ్, బాబీ సింహ, అనీషా అంబ్రోస్, శరత్, రాజసింహ, దూళిపాళ నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ఎ.ఎం.రత్నం విడుదల చేశారు. ఆడియో సీడీలను అల్లరి నరేష్ విడుదల చేసి తొలి సీడీని రాజ్ తరుణ్ కు అందించారు.సందీప్ కిషన్ మాట్లాడుతూ ''గత సంవత్సరం నేను గుడ్, బ్యాడ్ టైం చూసేశాను. చాలా నేర్చుకున్నాను. చాలా మారాను. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం వచ్చింది. అనీల్ సుంకరగారు ఎప్పుడూ నా వెల్ విషర్. నిర్మాతలు మంచితనానికి మారు పేరు. బాబీ ఫెంటాస్టిక్ యాక్టర్. తను గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. అనీషా మంచి కో స్టార్. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. దర్శకుడు అని కన్నెగంటి సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


అనీల్ సుంకర మాట్లాడుతూ 'ఒక సంవత్సరం క్రితం ఈ సినిమా చేద్దామని సందీప్ తో అన్నాను. రైట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారి దగ్గర నుండి రైట్స్ మాకు రాగానే సుధాకర్ గారు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. వెంటనే సందీప్ కిషన్ కు ఫోన్ చేసి నాపై నమ్మకంతో సినిమా చేయమని అన్నాను. తను సరేనన్నాడు. ఈ సినిమాను తెలుగులో మేం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. బెస్ట్ కాన్సెప్ట్. అని కన్నెగంటి మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్. మలయాళంలోని సోల్ మిస్ కాకుండా ఎలా బాగా వర్కవుట్ చేసి తెరకెక్కించాడు. మూవీని చూడగానే మనం కోరుకునే మూవీ వచ్చిందని అందరూ అనుకుంటారు. మహత్ చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. బాబీ సింహ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు. తనని తెలుగులో పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయనది మన బందరు. ఆయన చేసిన ఈ రోల్ చూస్తే, ఆయన తప్ప ఎవరూ చేయలేరని అంటారు. సందీప్ ఫుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాడు. అనీషాకు మంచి బ్రేక్ ఇస్తుంది. సాయికార్తీక్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తను ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. మార్చి 23న సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు.


బాబా సింహా

బాబా సింహా

బాబీ సింహ మాట్లాడుతూ ‘'ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు అని, నిర్మాత సుధాకర్, అనీల్ సుంకర గారికి థాంక్స్. సినిమా డిఫరెంట్ గా ఉంది. టైటిల్ లాగానే సినిమాలో ఎనర్జీ ఉంటుంది అన్నారు.


దర్శకుడు అని కన్నెగంటి

దర్శకుడు అని కన్నెగంటి

మాట్లాడుతూ ‘నాకు బాగా నచ్చిన సినిమా. రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉండే సినిమా. నేను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. సాయి బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలా ఫాస్ట్ గా ట్యూన్స్ అందించాడు. బాబాయ్.. సాంగ్ కు ప్రేక్షకులు ఎవరైనా డ్యాన్స్ చేసి ఆ వీడియోను మాకు పంపిస్తే అందులో బెస్ట్ డ్యాన్సులు ఐదారింటిని సెలక్ట్ చేసి సినిమాలో యాడ్ చేస్తాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.


అల్లరి నరేష్

అల్లరి నరేష్

అనీల్ సుంకరగారు ఓకే సమయంలో నాలుగైదు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఆయన గుడ్ టైం, బ్యాడ్ టైం వచ్చినా మారని వ్యక్తి. సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుంది అన్నారు.


రాజ్ తరుణ్

రాజ్ తరుణ్

బెస్ట్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, మంచి యాక్టర్ సందీప్, సాయికార్తీక్ మ్యూజిక్ ఇలా చాలా కారణాలతో సినిమా పెద్ద హిట్టవుతుందని చెప్పగలను. బాబీ సింహగారికి పెద్ద ఫ్యాన్ అన్నారు.


English summary
Watch Sundeep Kishan's Run theatrical trailer. Co-starring Anisha Ambrose in the female lead, directed by Ani Kanneganti. Music by Sai Karthik. Produced By Sudhakar Cherukuri, Kishore Garikipati, Ajay Sunkara.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu