»   » షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు సందీప్ కిషన్ పిలుపు

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు సందీప్ కిషన్ పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా... ‘బీరువా' చిత్రం తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సందీప్ కిషన్... షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు పిలుపు ఇచ్చారు. ఒక మెయిల్ ఐడి ఇచ్చి యంగ్ మేకర్స్ అయిన ఎవరైనా ఒక పేజి సినాప్సిస్ ని పంపమన్నాడు. అలా వచ్చిన వాటిలో నచ్చిన వారిని పిలిచి పూర్తి నేరేషన్ ఇమ్మంటానని చెప్పారు. మీ కథ నచ్చితే మీరు దర్శకత్వం వహించే మొదటి సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తానని అన్నారు. ఆ ఈ మెయిల్ ఐడీ ఇక్కడ ఇస్తున్నాం... rajadanda@gmail.com

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలో సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా పెద్ద హిట్ అయ్యింది. అతను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్.. సందీప్ కిషన్ కాకుండా డైరెక్టర్ పూరి జగన్నాధ్, విష్ణు మంచు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ టాలెంట్ ని గమనించి వారికి అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

Sundeep Kishan’s invitation for short filmmakers

సందీప్ కిషన్ ‘బీరువా' విషయానికి వస్తే...

కథ విషయానికొస్తే...హైద‌రాబాద్‌లో ఇండ‌స్ట్రియ‌లిస్ట్ అయిన సూర్య‌నారాయ‌ణ‌(న‌రేష్‌) కొడుకు సంజు(సందీప్ కిషన్), భార్య అనిత‌(అనితా చౌద‌రి) ఉంటాడు. సంజు ఎప్పుడూ త‌న అల్ల‌రితో తండ్రికి బిపి పెంచుతుంటాడు. ఓ సంద‌ర్భంలో విజ‌య‌వాడ‌కి చెందిన ఒక వ్య‌క్తి చేతిలో 40 కోట్లు మోస‌పోయిన సూర్య‌నారాయ‌ణ‌కి ఏం చేయాలో తెలియ‌దు. దాంతో సంజు స‌ల‌హాపై విజ‌య‌వాడ‌ను శాసించే పెద్ద మ‌నిషి ఆది కేశ‌వులు నాయుడు(ముకేష్ రుషి) సాయం కోర‌డానికి అక్క‌డ‌కి సూర్య‌నారాయ‌ణ‌, సంజు వెళ‌తారు. అక్క‌డ ఆదికేశ‌వులు కూతురు స్వాతి(సుర‌భి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు సంజు. స్వాతి కూడా సంజుని ఇష్ట‌ప‌డుతుంది. బీరువా సహాయంతో సంజు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

‘బీరువా' వినడానికే...కాస్త డిఫరెంటుగా ఉంది కదూ. సందీప్ కిషన్, సురభి హీరో హీరోయిన్లుగా కణ్మిణి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్టయ్యాక సందీప్ కిషన్ సినిమాలంటే ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. పైగా ఈ చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించడం, చోటా కె నాయుడు కెమెరా, తమన్ సింగీతం ఉండటం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించాడో చూద్దాం...

English summary
Sundeep Kishan tweeted:" To all the short film makers out there..looking for fresh out of the box concepts..pls mail in a 1 page synopsis to rajadhandagmail.com. The best of the bunch will b called in for a narration which will be taken directly by me & given an opportunity to direct a feature film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu