»   » ఫోన్ బూతో, పాల బూతో, ఏదో ఒకటి హిట్ కొడితే చాలు

ఫోన్ బూతో, పాల బూతో, ఏదో ఒకటి హిట్ కొడితే చాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ లో వచ్చి హిట్టైన చిత్రం ఫోన్ బూత్. ఆ చిత్రం ఆధారంగా..ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో అలీ మీద ఓ కామెడీ ట్రాక్ ని తన చిత్రంలో పెట్టేసారు. ఆ తర్వాత గీత అంటూ తెలుగులో రిషి హీరోగా ఓ చిత్రం వచ్చింది. మళ్లీ అలాంటి కథ తోనే సందీప్ కిషన్ ట్రై చేయబోతున్నారా... అయ్యండవచ్చు అంటున్నారు.

సందీప్ కిషన్ హీరోగా రాజసింహ దర్శకత్వంలో 'ఒక్క అమ్మాయి తప్ప' టైటిల్ తో ఓ చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ని లేటెస్ట్ గా విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని చూసిన వారు ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ బూత్ లోని మెయిన్ ప్లాట్ కు ఓ ఫ్లై ఓవర్ ని యాడ్ చేసి ఈ చిత్రం రెడీ చేసారని చెప్పుకుంటున్నారు.

Sundeep Kishan's Okka Ammayi Thappa Theatrical Trailer

వాస్తవానికి ఓ ట్రైలర్ చూసి కథ ఇదే అంటూ ఓ నిర్ణయానికి రావటం పద్దతి కాదు. అయితే సందీప్ కిషన్ వరసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలంటూ వరస ఫెయిల్యూర్స్ తో ఉన్నాడు. దాంతో ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో నిత్యామీనన్ ని సైతం తోడు తెచ్చుకుని ఓ థ్రిల్లర్ జోనర్ కథతో వస్తున్నాడు. ఫోన్ బూతో లేక పాల బూతో ఏదోటి హిట్ కొడితే సందేషమే.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. నిజమవ్వాల్సిన తన కల... గెలవాల్సిన తన ప్రేమ.. ఒక ఫోన్‌కాల్‌తో చెదిరిపోయాయని హీరో సందీప్‌ కిషన్‌ తాజాగా విడుదలైన 'ఒక్క అమ్మాయి తప్ప' ట్రైలర్‌లో పేర్కొన్నారు. ఒక్క అమ్మాయి కారణంగా తన జీవితంలో జరిగిన సంఘటనలను ట్రైలర్‌లో సందీప్‌ చెప్పుకొచ్చారు.

టి. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి. అంజిరెడ్డి నిర్మించారు. నిత్యా మేనన్‌ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. మిక్కీ జె. మేయర్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బ్రహ్మానందం, అలి, సప్తగిరి తదితరులు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Sundeep Kishan's Okka Ammayi Thappa Theatrical Trailer released. And it remembers Hollywood Phone Booth movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu