»   » సందీప్ కిషన్ ...షార్ట్ ఫిలిం వస్తోంది

సందీప్ కిషన్ ...షార్ట్ ఫిలిం వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sundeep Kishan's Short Film Coming Soon
హైదరాబాద్ : రీసెంట్ గా వచ్చిన వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రంతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న హీరో సందీప్ కిషన్. వైవిధ్యానికి విలువ ఇస్తానని చెప్పే సందీప్ ...తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నిర్మిస్తున్నారని సమాచారం. ఎ సైలైంట్ మెలోడి టైటిల్ తో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిలిం..యూ ట్యూబ్ లో త్వరలో పలకరించనుంది. దీన్ని ప్రశాంత్ వర్మ రాసి,డైరక్ట్ చేస్తున్నారు.

ఇక 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూన్న సందీప్ కిషన్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తనకు గుండెల్లో గోదారి చిత్రంతో గుర్తింపు తెచ్చి పెట్టిన దర్శకుడు కుమార్ నాగేంద్రతో తన తదుపరి చిత్రం ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ పూర్తి అయ్యి...మిగతా నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. సందీప్ కిషన్ కి ఇప్పుడు బ్రేక్ రావటంతో వరస ఆఫర్స్ వస్తున్నాయి. నిర్మాతలు సైతం అతనిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


సందీప్ కిషన్ మాట్లాడుతూ... 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో నాకు మంచి హిట్టొచ్చినా వెంటనే ఏ సినిమాకీ నేను సంతకం చేయలేదు. నేను ఊహించనంత రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు డబ్బు కంటే సినిమా ముఖ్యం. సందీప్ సినిమా అంటే ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా వస్తున్నారు. వాళ్లని సంతృప్తిపరచడం నా బాధ్యత. వాళ్లని దూరం చేసుకోని సినిమాలే చేస్తాను.

అలాగే కొంత కాలం పాటు మరింత గుర్తింపు కోసం సోలో హీరో సినిమాలే చేద్దామని నిర్ణయించుకున్నా. 'డీకే బోస్' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'రారా కృష్ణయ్య' చేస్తున్నా. 'రొటీన్ లవ్‌స్టోరీ' తర్వాత మరోసారి రెజీనాతో కలిసి చేస్తున్నా. వంశీకృష్ణ నిర్మిస్తున్న ఆ చిత్రానికి కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ డైరెక్టర్. మరో రెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయి అన్నారు.

English summary
Sundeep Kishnan who is recently got a Big hit with movie Venkatadri Express and now,working for 3 movies at same time and as a special feature he was Producing a Short Film named 'A silent melody' and this will be released in to Youtube very soon and This is written & directed by Prashant Varma .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu