»   » ‘టైగర్’ వస్తున్నాడు....

‘టైగర్’ వస్తున్నాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం 'టైగర్'. రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా 'ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాల తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాతలు తెలిపారు. మే నెల రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ - ''ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అని చెప్పారు.


Sundeep Kishan's Tiger release date

'ఠాగూర్' మధు మాట్లాడుతూ - ''ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. అన్నివర్గాల వారూ చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అన్నారు.


తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.

English summary
Sundeep Kishan's Tiger movie releasing on May second week.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu