»   » నేరం చేస్తున్న సందీప్ కిషన్

నేరం చేస్తున్న సందీప్ కిషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో సందీప్ కిషన్ సినిమాలు వరస పెట్టి చేసుకుంటూ జోరు మీద ఉన్నారు. ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలంటే ఆయన ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆయన మళయాళ చిత్రం రీమేక్ కమిటయ్యారు. ఆ చిత్రం మరేదో కాదు నేరమ్.

2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం'. నేరమ్ చిత్రం తమిళ,మయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదొక డార్క్ కామెడీ చిత్రం. నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది. ఈ చిత్రంతోనే అతనికి మంచి పేరు వచ్చింది. నజ్రియా నసీమ్, నవీన్ పోలి ఈ సినిమాలో చేసారు.

Sundeep Kishan stars in Telugu remake of super hit Tamil film NERAM

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "123"టైటిల్ తో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మిస్టర్ నోకియా చిత్రం మంచు మనోజ్ చేసిన దర్శకుడు అనీల్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నారు. నేరం అంటే టైం అని అర్దం. గతంలో ఈ చిత్రాన్ని దాసరి గారు తన కుమారుడు అరుణ్ కుమార్ తో చేద్దామనుకున్నారు. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు.

ఇక ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.

English summary
Hero Sandeep Kishan, who is not getting any hits these days, is now remaking "Neram" into Telugu with the tentative titled "123". Director Anil who made Mr Nokia with Manchu Manoj is wielding megaphone for this project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu