For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంతకీ ‘బీరువా’తో ఎవరిని దాచారు?(ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ :సందీప్‌కిషన్‌, సురభి జంటగా నటిస్తున్న సినిమా ‘బీరువా'. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రామోజీరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కణ్మణి దర్శకుడు. ‘సంజుగాడి ఫ్రెండ్‌' అనేది ఉప శీర్షిక.

  మనకేమైనా సమస్యలొస్తే స్నేహితుల్నో, కుటుంబ సభ్యుల్నో సాయం అడుగుతాం. కానీ సంజు మాత్రం బీరువాని అడుగుతాడు. చిన్నప్పట్నుంచీ అతనిది అదే వరస. అతడికి కష్టం ఎదురైన ప్రతీసారీ ఓ ఆపద్బాంధవుడిలా ఆదుకొంటుంది బీరువా. చివరికి తన ప్రేమ విషయంలోనూ అదే జరిగింది. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సందీప్‌కిషన్‌.

  ఇక ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. హైదరాబాద్‌లో యీనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఫొటోలు ఇవి.

  స్లైడ్ షోలో...

  ఫస్ట్ లుక్

  ఫస్ట్ లుక్

  సంపీద్ కిషన్ హీరోగా నటించిన చిత్రం 'బీరువా'. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ ఇది.

  దర్శకుడు మాట్లాడుతూ....

  దర్శకుడు మాట్లాడుతూ....

  ''ప్రతిష్ఠాత్మకమైన రెండు నిర్మాణ సంస్థలు కలిసి చేసిన ఈ సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన రామోజీరావు, జెమినీ కిరణ్‌లకు నా కృతజ్ఞతలు. ఈ కథలో బీరువా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కథానాయకుడికి ఎలాంటి సమస్య ఎదురైనా బీరువా సాయంతో అధిగమిస్తుంటాడు. ఆ సన్నివేశాలు వినోదాన్ని పంచిపెడతాయి అన్నారు.

  దర్శకుడు కంటిన్యూ చేస్తూ...

  దర్శకుడు కంటిన్యూ చేస్తూ...

  కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన చిత్రమిది. సందీప్‌కిషన్‌ అల్లరి కుర్రాడిగా చక్కటి అభినయం ప్రదర్శించాడు. తన చుట్టూ ఉన్నవాళ్లందరికీ చిక్కులు తెచ్చిపెడుతుంటాడు. తను మాత్రం ఆ చిక్కుల నుంచి తప్పించుకొంటూ ఉంటాడు. సురభి తెరపై అందంగా కనిపిస్తుంది. ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించే ప్రయత్నం చేశారు ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు. ఇది ఇంటిల్లిపాదికీ వినోదాలు పంచే ఓ మంచి సినిమా అవుతుంది'' అన్నారు.

  కథ ఇది..

  కథ ఇది..

  ''ప్రతీ ఇంట్లోనూ బీరువా ఉంటుంది. అందులో రకరకాల వస్తువులు దాచుకొంటుంటారు. అయితే తనను తాను బీరువాలో దాచుకొన్న ఓ కుర్రాడి కథే ఈ చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఒక ప్రేమజంటకి బీరువా ఎలా సాయపడిందన్నది ఆసక్తికరం.

  సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ....

  సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ....

  'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత ఒప్పుకొన్న సినిమా ఇది. నటుడిగా నాకు ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. కథ, కథనం... అన్నీ కొత్త తరహాలో సాగుతుంటాయి. కణ్మణి ఈ చిత్రంతో నా నటనకు మరిన్ని మెరుగులు దిద్దారు. మా ఛోటా మావయ్య ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించారు. ఆయన సెట్‌లో ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. తమన్‌, గౌతంరాజు లాంటి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేసింది. వెలిగొండ శ్రీనివాస్‌ రాసిన మాటలు త్రివిక్రమ్‌ను గుర్తుకు తెప్పిస్తాయి. 'బీరువా' రూపంలో తప్పకుండా ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

  ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ..

  ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ..

  ''ఈ సినిమా పేరు గురించి మొదట వి.వి.వినాయక్‌తో చెప్పాను. ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌తో పాటు మీరంతా కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'బీరువా'అంటే ఆసక్తికరంగానే ఉంటుందని ప్రోత్సహించారు. ఇప్పుడు నిజంగానే ఆ పేరుపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది'' అన్నారు ఛోటా కె.నాయుడు.

  వెలిగొండ మాట్లాడుతూ...

  వెలిగొండ మాట్లాడుతూ...

  ''కథని నమ్మి సినిమాలు చేసే నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సినిమా తప్ప వేరే ఆలోచనలేని రెండు పెద్ద సంస్థలు కలిసి చేస్తున్న ఈ సినిమాకి పనిచెయ్యడం అదృష్టంగా భావిస్తున్నానని'' అన్నారు వెలిగొండ శ్రీనివాస్‌.

  ఈ కార్యక్రమంలో....

  ఈ కార్యక్రమంలో....

  జెమినీ కిరణ్‌, అనితాచౌదరి, సంధ్య, సాహి సురేష్‌, సుబ్రతా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

  తెరముందు...

  తెరముందు...

  సందీప్ కిషన్, నరేష్‌, ముఖేష్‌ రుషి, అనీషాసింగ్‌, చలపతిరావు, అజయ్‌, సప్తగిరి, వేణు, షకలక శంకర్‌, గుండు సుదర్శన్‌, శివన్నారాయణ, అనితాచౌదరి, సంధ్య తది తరులు నటించారు.

  తెర వెనక...

  తెర వెనక...

  ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, పాటలు: శ్రీమణి, పోరాటాలు: వెంకట్‌, నృత్యాలు: రాజుసుందరం, బాబా భాస్కర్‌, శేఖర్‌, కళ: సాహి సురేష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌:సుబ్రతా చౌదరి

  English summary
  Sandeep Kishan's latest Beeruva First Look Launched in Hyderabad. This Film directed By Kanmani .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X