»   » ఖరారు: సునీల్ హీరోగా 'రక్ష' డైరక్టర్

ఖరారు: సునీల్ హీరోగా 'రక్ష' డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సునీల్ హీరోగా ఆర్.పి.ఏ క్రియేషన్స్ చిత్రం సునీల్ హీరోగా,రక్ష చిత్రం దర్సకుడు ఆకెళ్ల వంశీ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రేమ కధా చిత్రమ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమ ప్రేమ కథా చిత్రమ్ తర్వాత ఎన్నో కతలు విన్నా తన బ్యానర్ లో వచ్చే రెండో చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టుని ఓకే చేసినట్లు చెప్తున్నారు. పిభ్రవరి 28న సునీల్ పుట్టిన రోజు సందర్బంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ మీడియాకు ఈ విషయాన్ని తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...ముందుగా మా హీరో సునీల్ పుట్టిన రోజు సందర్భంగ మా చిత్రం యూనిట్ అందరి తరుపునా జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమ కథా చిత్రమ్ తర్వాత ఎన్నో కథలు విన్నాను. కానీ నా మొదటి ప్రయత్నాన్ని చిన్న చిత్రాల్లో అఖండ విజయంగా అందించిన తెలుగు ప్రేక్షకులందరి అంచనాలు అందుకునేలా మా బ్యానర్ ఆర్.పి. ఏ క్రియేషన్స్ వ్యాల్యూని నిలబెట్టే చిత్రంగా ఉండాలని మంచి కథలు చూస్తున్న సమయంలో రక్ష చిత్రం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మంచి కథతో నా దగ్గరకి వచ్చారు. నేను, సునీల్ గారు విన్న వెంటనే అంగీకరించాను.

Suneel next with Raksha director

సునీల్ గారికి ఎలాంటి కథ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో వంద శాతం అదే రేంజి కథతో మా బ్యానర్ లో వస్తున్నాము. సునీల్ గరి బాడీ లాంగ్వేజ్ ని కొత్తగా చూపించబోతున్నారు దర్శకుడు వంశీ. సునీల్ గారి నుంచి ఎలాంటి ఎంటర్ట్మెంట్ కోరుకుంటామో అదే ఈ చిత్రంలో ఉంటుంది. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించే నటీనులు వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో తెలియచేస్తాం. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా వుంటుంది అని అన్నారు.

దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ... రక్ష లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాకు అన్ని కమర్షియల్ హంగులున్న కథ కుదిరింది. ఈ కథని సునీల్ గారికి చెప్పిన వెంటనే ఇలాంటి కథ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అన్నారు. ఓ కమర్షియల్ కథని సునీల్ గారు హీరోగ ఓకే చేయటం, దానికి నిర్మాత సుదర్శన్ రెడ్డి గారు నిర్మాతగా ఉండటం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

English summary
Suneel next with Raksha director Akella Vamsi Krishna.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu