twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '2 కంట్రీస్' ట్విట్టర్ రివ్యూ: ఈ సినిమా అయినా సునీల్‌ను కాపాడిందా?..

    |

    Recommended Video

    '2 కంట్రీస్' ట్విట్టర్ రివ్యూ..

    ఒక్క ఛాన్స్ లాగా.. హీరో సునీల్ కెరీర్‌కు ఇప్పుడు అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలి. 'హీరో' చట్రంలో ఇరుక్కుని సునీల్ తప్పు చేశాడన్న విమర్శలకు చెక్ పెట్టడానికైనా ఇప్పుడు సునీల్ కు ఒక హిట్ కావాలి.

    హీరోగా సునీల్ చేసిన ఒక దశాబ్దపు ప్రయాణంలో.. 'అందాల రాముడు', మధ్యలో మర్యాద రామన్న తప్పితే చెప్పుకోవడానికి పెద్ద హిట్స్ లేవు. కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో సునీల్ పరిస్థితి ఒకరకంగా అగమ్యగోచరంగా తయారైంది.

    ఇలాంటి తరుణంలో నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన 2కంట్రీస్ సునీల్‌ను కాపాడుతుందా?.. ట్విట్టర్‌లో నెటిజెన్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం..

    అక్కడ సూపర్ హిట్ టాక్!:

    2 కంట్రీస్ చిత్ర దర్శకుడు ఎన్.శంకర్ సినిమా ఫలితంపై ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఓవర్ సీస్‌లో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని, అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోందని తెలిపారు. సినిమాకు మీ మద్దతు తెలపాలని కూడా ప్రేక్షకులను కోరారు.

    ఇమిటేషన్..:

    సినిమా ప్రారంభంలో సునీల్ పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేస్తాడని ఓ నెటిజెన్ అభిప్రాయపడం గమనార్హం.

     నెగటివ్ టాక్:

    నెగటివ్ టాక్:

    2కంట్రీస్ సినిమా సునీల్ కు మరో నిరాశనే మిగిల్చిందన్న టాక్ కూడా వినిపిస్తుండటం గమనార్హం. సినిమాలో ఫస్టాఫ్ బాగాలేదని, సెకండాఫ్ దాని కంటే కాస్త బెటర్‌గా ఉందని చెబుతున్నారు.

     దర్శకుడు తప్పు చేశాడా?:

    దర్శకుడు తప్పు చేశాడా?:

    మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టుకు తగ్గ హీరోను ఎంచుకోవడంలో దర్శకుడు విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తుండటం గమనార్హం. అంత ఖర్చు పెట్టి అమెరికాలో తెరకెక్కించిన సినిమాకు.. అంతే మార్కెట్ స్టాండర్డ్స్ ఉన్న హీరోను తీసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు.

     బి, సీ సెంటర్స్‌ను ఆకట్టుకోవచ్చు..:

    బి, సీ సెంటర్స్‌ను ఆకట్టుకోవచ్చు..:

    విశ్లేషకుల అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ.. సునీల్ సినిమా బి, సీ సెంటర్లలో మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సినిమాలో కామెడీ పెద్దగా పేలలేదని, చాలా సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయన్న టాక్ వినబడుతోంది.

    English summary
    Sunil's Telugu remake of Malayalam '2 Countries' has been released today with the same name. After his box office debacle with 'Ungarala Rambabu', the romantic comedy entertainer '2 Countries' is receiving positive talk from the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X