»   » తమిళ, కన్నడంలో హిట్‌ని సునీల్ తో రీమేక్

తమిళ, కన్నడంలో హిట్‌ని సునీల్ తో రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ భాషలో సుందర పాండ్యన్ గా రూపొంది విజయం సాధించిన చిత్రం రెండు రోజుల క్రితం కన్నడంలో నూ రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. యష్ హీరోగా నటించిన ఆ చిత్రం రాజహౌలి. ఈ చిత్రంలో యష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగులో ఆ రీమేక్ చేయటానికి సునీల్ ముందుకు వచ్చారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.

అందాలరాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా తన 'తడాఖా' ఏంటో చూపించారు సునీల్. ప్రస్తుతం ఆయన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దసరాబుల్లోడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపేశారు సునీల్. అందులో మొదటిది భీమినేని శ్రీనివాసరావు సినిమా. 'సుడిగాడు' లాంటి భారీ విజయం తర్వాత సునీల్‌తో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేశారు భీమినేని.


రీమేక్‌ల స్పెషలిస్ట్ అయిన భీమినేని... సునీల్‌తో తెరకెక్కించే సినిమా కూడా రీమేకే కావడం విశేషం. తమిళ హిట్ 'సుందరపాండ్యన్' చిత్రాన్ని సునీల్ కథానాయకునిగా రీమేక్ చేయబోతున్నారాయన. ఇక రెండో సినిమా విషయానికొస్తే... ఈ సినిమా ద్వారా రచయిత గోపిమోహన్ దర్శకునిగా పరిచయం కానున్నారు. మళ్ల విజయప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌కి వెళ్లనుంది.

ఒక భాషలో హిట్టైన చిత్రం మరో భాషలో రీమేక్ కావడం కొత్తేమీ కాదు. రీమేక్‌ల పేరుతో ప్రతీ భాషలోనూ బోలెడన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. కాకపోతే ఇటీవల వరసగా రీమేక్స్ తెలుగులో వస్తున్నాయి. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం.

English summary
Sundarapandian which was initially made in Tamil became a very good commercial hit apart from getting good review from the media. Same is repeated in the case of Kannada remake of Sundarapadian, which was released with the title RAJAHULI on 1/11/2013, Yesh acted as Rajahuli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu