»   » హీరో సునీల్‌ కొత్త కారు, ఫ్యాన్సీ నంబరు ఇదే... రేటెంతో ఎంతో తెలుసా?

హీరో సునీల్‌ కొత్త కారు, ఫ్యాన్సీ నంబరు ఇదే... రేటెంతో ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:తమకు ఇష్టమైన లేదా కలిసొచ్చే నంబరు కోసం ఎంత మొత్తమైనా సరే, చెల్లించి ఆ నంబరును సొంతం చేసుకుంటూ ఉంటారు సెలబ్రెటీలు. ఈ క్రమంలో హీరో సునీల్ తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నాడు. రూ. 40 లక్షల విలువ చేసే తన స్కోడా లూరిస్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మలక్ పేటలోని ఆర్టీఏ కార్యాలయానికి సునీల్ నిన్న వెళ్లారు.

సునిల్... ముసారాంబాగ్‌లోని మలక్‌పేట ఈస్ట్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయంకి వచ్చిన విషయాన్ని మలక్‌పేట ఈస్ట్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయంలోని ఎంవీఐలు నాగరాజు, టి.వెంకటేశ్వర్‌రావుకు సమాచారం ఇవ్వగా వారంతా దగ్గరుండి రిజిస్ట్రేషన్‌ చేయించారు.

రూ.31.73లక్షల విలువ చేసే తెలుపురంగు స్కోడా లారిన్‌ కారుకు టీఎస్‌11ఈజే 2345 నంబరును అధికారికంగా కేటాయించారు. టీఎస్11ఇజే2345 నెంబరు కోసం పదివేల రూపాయల విలువ చేసే డీడీని సునీల్ తమకు ఇచ్చాడని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Sunil bought his registration number for Rs 10,000

ఇంతకు ముందు కూడా ..జూనియర్ ఎన్టీఆర్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కొన్నాడు. అయితే కారు రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఎన్టీఆర్ 11లక్షలు వెచ్చించారట. టిఎస్ 09ఎక్స్‌ఎక్స్ 9999 అనే నెంబర్ తన కారు నెంబర్ గా ఉండాలని భావించిన జూనియర్ చాలా కష్టపడి ఎట్టకేలకు దక్కించుకున్నాడట.

English summary
Tollywood hero Sunil on Monday bought a fancy registration number 2345' by spending Rs 10,000 for his Scoda car in Regional Transport Authority (RTA), Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu