Just In
- 9 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 53 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కులం వల్లే ఎదిగావా? అన్నారు, చంపేస్తానన్నా: హీరో సునీల్ వివరణ
హైదరాబాద్: హీరో సునీల్... కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై, అందరినీ నవ్వించి....ప్రస్తుతం హీరోగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్నేళ్లుగా మనం సునీల్ ను చూస్తున్నాం.... ఏదైనా విషయమై ఆయన కోపంగా స్పందించిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి.
అలాంటి సునీల్ ఆ మధ్య జక్కన్న మూవీ సినిమా రిలీజ్ సమయంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో... తీవ్రమైన కోపానికి గురి కావడం, తనను చెత్త ప్రశ్నలు అడిగిన యాంకర్ మీద ఫైర్ అవ్వడం చూసి అంతా షాకయ్యారు. అఫ్ కోర్స్ సునీల్ అలా కోపంతో ఊగి పోవడానికి కారణం కూడా ఉంది.

చెత్త ప్రశ్నలు
‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?'... మిమ్మల్ని హీరోగా జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సునీల్ తీవ్రమైన అసహనానికి గురయ్యారు.

ఇంత దారుణంగా
అంతటితో ఆగని..... యాంకర్ నువ్వు పుట్టిన కులం వల్లే ఇంత పైకి వచ్చావా?' అంటూ మరో ప్రశ్న సంధించాడు. ఈ ప్రశ్నకు సునీల్ కోపం కట్టలు తెంచుకుంది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే చంపేస్తా అని ఆ యాంకర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు సునీల్.

ఫేక్ ఇంటర్వ్యూ అంటూ ప్రచారం
అయితే కావాలనే ఇంటర్వ్యూలో ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలు వేసారని.... పబ్లిసిటీ కోసం సునీల్, టీఆర్పీ రేటింగుల కోసం ఛానల్ వారు కుమ్మక్కయి ఈ ఇంటర్వ్యూను ముందే ప్లాన్ ప్రకారం ఇలా వివాదాస్పదంగా క్రియేట్ చేసారని ప్రచారం జరిగింది.

సునీల్ వివరణ
దీనిపై సునీల్ ఇప్పడు వివరణ ఇచ్చాడు. ‘అది ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఆ ప్రశ్నలకు నిజంగానే సీరియస్ అయ్యాను. ఇంటర్వ్యూ ముందే నాకు ఆ యాంకర్ చెప్పాడు.. ఈ ప్రోగ్రామ్‌లో రెగ్యులర్ ప్రశ్నలు కాదు.. కొంచెం స్ట్రాంగ్‌గా అడుగుతాను అని. మీ ప్రశ్నలను బట్టే నా సమాధానం ఉంటుంది అని చెప్పా... అందుకే నేను కోపంతో తిట్టినా వారు లైట్ తీసుకున్నారనే విధంగా సునీల్ చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోలను ఇలా అడిగే వారా?
ఆ ఇంటర్వ్యూ తర్వాత సునీల్ కు అభిమానుల నుండి మద్దతు లభించింది. ఆ టీవీ ఛానల్ సునీల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిందని, అదే చిరంజీవి లేదా అతని ఫ్యామిలీ హీరోలను, నందమూరి హీరోలను, కృష్ణ మహేష్ బాబు లాంటి స్టార్లను ఇలాంటి ప్రశ్నలు అడిగే వారా? అంత దమ్ము ఆ ఛానల్ కు ఉందా? అంటూ అప్పట్లో కొందరు ఘాటుగానే విమర్శించారు.