»   » స్టార్ హీరో రేంజిలో పెరిగిన సునీల్ రెమ్యునేషన్

స్టార్ హీరో రేంజిలో పెరిగిన సునీల్ రెమ్యునేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమెడియన్‌ నుండి హీరోగా మారిన సునీల్‌ డిమాండ్ బాగా పెరిగిందని అందుకు తగినట్లే రెమ్యునేషన్ కూడా పెంచాడని తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాన్ని బట్టి సునీల్ ఇప్పుడు సినిమాకు మూడు కోట్లు వరకూ డిమాండ్‌ చేస్తున్నాడని సమాచారం. కమేడియన్ నుంచి హీరోగా మారిన వాళ్ళు ఇంత భారీ రెమ్యునేషన్ తీసుకోవటం సినీ చరిత్రలోనే ప్రధమం అంటున్నారు. 'మర్యాద రామన్న' విజయమే సునీల్ కు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత అతన్ని ఇమ్మిడియట్ గా ప్రముఖ దర్సకుడు రామ్ ‌గోపాల్ ‌వర్మ బుక్ చేయటంతో అతని దశ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన సునీల్ ‌తో 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పలరాజు' సినిమా తీస్తున్నారు. ఇందు నిమిత్తం సునీల్‌ కు రెండున్నర కోట్లు ముట్టాయని చెప్పుకుంటున్నారు. ఇక అప్పలరాజు చిత్రం చేస్తుండగానే సునీల్‌ కు మరో రెండుమూడు చిత్రాలలో హీరోగా ఆఫర్లు లభించాయి. టాలీ టు హాలీ సంస్థ సునీల్‌ హీరోగా నెపోలియన్ అనే సినిమా నిర్మిస్తోంది. మరో ప్రముఖ సంస్థ కూడా సునీల్‌ తో సినిమా చేసేందుకు ఎగ్రిమెంట్ చేసుకంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu