»   »  సునీల్-గోపీ మోహన్ సినిమా ఆగిపోయింది

సునీల్-గోపీ మోహన్ సినిమా ఆగిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్ ప్రయాణం అనుకున్న స్థాయిలో సాగడం లేదనేది వస్తవం. ఈ మధ్య కాలంలో సునీల్ సినిమా థియేటర్లలో కనబడి చాలా కాలం అయిపోయింది. మరికొన్ని రోజులైతే సునీల్ ను అంతా మరిచిపోతారని అనుకుంటున్న తరుణంలో డిసెంబర్లో ఆయన నటించిన సినిమా విడుదలకు సిద్దమైంది.

సునీల్ హీరోగా వాసు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన క్రిష్ణాష్ట‌మి సినిమా క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం సునీల్ వంశీ క్రిష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత రైట‌ర్ గోపీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉంది. సునీల్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో అనుకున్న సమయాని ఈ మూవీ మొదలు కాలేదు. దీంతో గోపీ మోహన్ తన నిర్ణయం మార్చుకుని వేరే హీరోతో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Sunil - Gopi Mohan movie stalled

సునీల్ నటిస్తున్న కృష్ణాష్టమి వివరాల్లోకి వెళితే...
వాసువర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు. డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటించారు.

దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
As the fans of Sunil have been made to wait by their star for a long time, the ace writer and debutante director Gopi Mohan. But source said that movie was stalled.
Please Wait while comments are loading...