»   » సలోనితో కలసి డాన్స్ ఇరగదీస్తున్న సునీల్!

సలోనితో కలసి డాన్స్ ఇరగదీస్తున్న సునీల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్ హీరోగా దర్శకధీర రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'మర్యాదరామన్న". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో సునీల్ అద్భుతమైన పాత్రను చేస్తున్నాడని ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే అందాల రాముడు చిత్రంలో తనని తాను నిరూపించుకున్న సునీల్ ఈ చిత్రంతో పూర్తి హీరోగా మారిపోనున్నాడని..సినీ పరిశ్రమలో టాక్.

తన కామెడీతో ప్రత్యేక హ్యాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న సునీల్..త్వరలో హీరోగా కూడా విజంభించనున్నాడన్న మాట. మగధీర వంటి చిత్రం తర్వాత రాజమౌళి ఈ చిత్రం చేస్తున్నాడంటే ఇప్పటికే ఈ చిత్రంలో ఏదో గొప్ప విషయం ఉందని అందుకే రాజమౌళి అగ్రనటులను విడిచి తన ఇమేజ్ కి వ్యతిరేకంగా సునీల్ తో చిత్రాన్ని రూపొందిస్తున్నాడని ప్రచారం. చిరంజీవి పాటకు డాన్స్ చేయడం ద్వారా నాకు సినిమాలలో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకునే సునీల్..ఈ చిత్రంలో సలోనితో అధ్బుతంగా డాన్స్లు చేస్తున్నాడట. గత కొంత కాలంగా ఈ చిత్రం ఏమైందో తెలియడం లేదని అనుకుంటున్న వారికి గత కొన్ని రోజులుగా షూటింగ్ వేగంగా సాగుతుందనే విధంగా విషయాలు బయటకు వస్తున్నాయి. మరైతే త్వరలో ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu