twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామెడీ సరుకు...(మిస్టర్ పెళ్లికొడుకు ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'కు రీమేక్‌గా తయారైన చిత్రం మిస్టర్ పెళ్లికొడుకు ఈ రోజు విడుదల అవుతోంది. సినిమాని పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు అణుగుణంగా మార్చామని, కామెడీ,సెంటిమెంట్ తో తీర్చిదిద్దామని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. పూల రంగడు చిత్రం తర్వాత వస్తున్న సునీల్ చిత్రం కావటంతో ట్రేడ్ లో సైతం మంచి బిజినెస్ జరిగింది. సునీల్ సైతం ఈ చిత్రం విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు.

    ఎన్నారై సునీల్ ఈ దేశంలో అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని,ఇక్కడ అమ్మాయిలైతే సంప్రదాయబద్దంగా ఉంటారని నమ్మకం. అందుకోసం ఓ పెళ్లి చూపులు కు వచ్చి..తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ..ఆమె తన బోయ్ ప్రెండ్ ని పెళ్లి చేసుకుంటోందని తెలుసుకుని షాక్ అవుతాడు. అదే విషయాన్ని తన తల్లి తండ్రులకు చెప్తాడు కానీ, కానీ అప్పటికే అతని మనస్సు పూర్తిగా ఆమెతో నిండిపోయి ఉంటుంది. చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇలాంటి సిట్యువేషన్ లో ఎలా చివరకు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఏ ఇబ్బందులు పడ్డాడన్నదే మిగతా కథ.

    ఎన్వీప్రసాద్ మాట్లాడుతూ "మా 'మిస్టర్ పెళ్లికొడుకు'కి పాటలకు మంచి స్పందన ఉంది. సునీల్ చాలా కష్టపడి ఎదిగాడు. ఈ సినిమాలో డ్యాన్స్ చేస్తుండగా కాలు విరిగినా అలాగే చేశాడు. ఎస్.ఎ.రాజ్‌కుమార్, సమీర్ రెడ్డికి ప్రత్యేకమైన ప్రశంసలు అందుతాయి'' అని తెలిపారు. పారస్‌జైన్ మాట్లాడుతూ "మా సినిమా చాలా బాగా పే చేస్తుందని సెన్సార్ సభ్యులు కితాబిచ్చారు. గతంలో 'ప్రియమైన నీకు' కూడా పరీక్షల సమయంలో విడుదలై 100 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని మూటగట్టుకుంటుంది. దేవి కామెడీ టైమింగ్ మెప్పిస్తుంది. రీరికార్డింగ్ చాలా బావుంది'' అని అన్నారు.

    బ్యానర్: మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్
    నటీనటులు: సునీల్, ఇషాఛావ్లా, రాఘన, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కాశీవిశ్వనాథ్, మధు, ఖలీల్, తులసి, ఉషశ్రీ తదితరులు
    సంగీతం: ఎస్.ఎ.రాజకుమార్,
    ఫైట్స్ : కనల్ కణ్ణన్,
    కో డైరెక్టర్స్ : ఎన్.బ్రహ్మాజీ, విజయ్ కుమార్,
    ప్రొడక్షన్ : భీమనేని రాయుడు,
    కళ: ఎం.ఎస్. కుమార్,
    ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి,
    ఎడిటింగ్: నందమూరి హరి,
    సమర్పణ: ఆర్.బి.చౌదరి,
    నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్,
    స్కీన్‌ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్.
    విడుదల తేదీ: మార్చి 1, 2013.

    English summary
    Mr Pellikoduku is one of the much-hyped and most-awaited Telugu films in 2013. Directed by Devi Prasad, the film features Sunil and Isha Chawla in the lead roles. It is an official remake of Madhavan's 2011 Hindi film Tanu Weds Manu, which has become big hit at the Box Office. The success of the Bollywood film has soared up the curiosity of its Telugu version to sky high.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X