»   » సునీల్ నెక్ట్స్ 'నెపోలియన్' చిత్రం లాంచింగ్ ఎప్పుడంటే...

సునీల్ నెక్ట్స్ 'నెపోలియన్' చిత్రం లాంచింగ్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్ త్వరలో "నెపోలియన్" అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి కో డైరక్టర్ కోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి రెండవ వారంలో ప్రారంభంకానుంది. ఇక ఈ చిత్రం కామిడీగా కాకుండా రెగ్యులర్ యాక్షన్ చిత్రం తరహాలో సాగనుందని సమాచారం.సునీల్ సరసన దీక్షాసేధ్ ని ఈ చిత్రంలో బుక్ చేసారు. ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కామిడీ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేయనున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట శివం అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించారు. కాని కథకు నెపోలియన్ టైటిల్ సూట్ అవుతుందనిపించటంతో ఈ టైటిల్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

సునీల్ బెస్ట్ ప్రెండ్ ఎన్నారై గణేష్ ఇందుకూరి శ్రాన్వి పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రాజస్ధాన్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రం సంగీతం అందిస్తారు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి డైరక్ట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందిన కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పలరాజు చిత్రం మొన్న శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. హీరోగా నెపోలియన్ చిత్రం సునీల్ కి నాలుగవది. ఈ చిత్రంపై సునీల్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

English summary
Sunil is going to act under Koti(who worked as assistant director under Rajamouli) direction, movie titled as 'Napoleon'. ‘Vedam’ fame Deeksha Seth opposite Sunil. In 'Napoleon' movie SS Rajamouli composing all action sequences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu