'బ్రహ్మోత్సవం' లో అడిగారు కానీ నటించటం లేదు
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో సునీల్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రను చేయనున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సునీల్ సన్నిహితులు ఈ విషయాన్ని ఖండించారు. సునీల్ ని ఆ బ్రహ్మోత్సవం టీమ్ అయితే ఎప్రోచ్ అయ్యిందని, కానీ ప్రస్తుతం డేట్స్ కేటాయించలేమని రిజెక్టు చేసామని చెప్పుతున్నారు. ప్రస్తుతం సునీల్ రెండు సినిమాలు చేస్తున్నాడు. దిల్ రాజు-వాసు వర్మ కాంబినేషన్ లో కృష్ణాష్టమి చిత్రం, వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో మరో చిత్రం .
ఈ సినిమాలో మహేష్ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలందిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉందీ చిత్రం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేయటంతో అభిమానులు ఆనందోత్సాహాలల్లో నిమగ్నమయ్యారు.
గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.


Click it and Unblock the Notifications











