»   » త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో సునీల్ రోల్ తెలిసిపోయింది.. చాలా కాలం తరువాత!

త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో సునీల్ రోల్ తెలిసిపోయింది.. చాలా కాలం తరువాత!

Subscribe to Filmibeat Telugu
Sunil To Cast In Trivikram New Movie

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రానికి అంతా సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్ ని ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ చిత్రం కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న ఫోటో ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తనదైన శైలిలో డిజైన్ చేస్తున్నారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సునీల్ పాత్రని త్రివిక్రమ్ చాలా వినోదాత్మకంగా మలిచారని సమాచారం.

 క్రేజీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం

క్రేజీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంపై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. త్వరలో ఈ చిత్రం పట్టాలపైకి వెళ్లనుంది.

కండలు తిరిగేలా తారక్ కసరత్తులు

కండలు తిరిగేలా తారక్ కసరత్తులు

త్రివిక్రమ్ చిత్రం కోసం ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్ ని ట్రై చేస్తున్నాడు. జిమ్ లో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న ఫోటో ఒకటి ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

 సునీల్ కోసం ప్రత్యేకంగా

సునీల్ కోసం ప్రత్యేకంగా

త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ కెరీర్ ఆరంభం నుంచి మంచి స్నేహితులు. చాలా కాలం తరువాత సునీల్ తన మిత్రుడి చిత్రంలో నటిచబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ సునీల్ పాత్రని ఆసక్తికరంగా మలచినట్లు తెలుస్తోంది. సునీల్ ఈ చిత్రంలో సెక్యూరిటీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడట.

సునీల్ చాలా కాలం తరువాత

సునీల్ చాలా కాలం తరువాత

సునీల్ కమెడియన్ గా ఉన్నప్పుడు వెండి తెరపై నవ్వుల పువ్వులు విరిసేవి. హీరో అయ్యాక సునీల్ నుంచి కామెడీ పంచ్ లని ఆడియన్స్ మిస్సయ్యారు. ఎన్టీఆర్ చిత్రంలో ప్రేక్షకులకు వినోదాత్మకంగా ఉండేలా సునీల్ పాత్రని త్రివిక్రమ్ మలచినట్లు తెలుస్తోంది.

ఇక అన్నిరకాల పాత్రలు చేయాలని

ఇక అన్నిరకాల పాత్రలు చేయాలని

హీరోగా సునీల్ కు ఈ మధ్య సరిగా కలసి రావడం లేదు.దీనితో అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని డిసైడ్ అయ్యాడు.

English summary
Sunil Role From Trivikram, MTR Film Revealed. Sunil will going to play entertaining role in this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X