»   » వీరు పోట్లతో సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’(ఫస్ట్ లుక్)

వీరు పోట్లతో సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’(ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం ఈడు గోల్డ్ ఎహే త్వరలోనే ప్రారంభం కానుంది.

గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. హిలేరియస్ ఎంటర్ టనర్ గా రూపొందనునున్న ఈ చిత్రంలో హీరోయిన్ సహా మిగతా నటీనటులు. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలియజేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

Sunil's Eedu Gold Ehe first look

ప్రస్తుతం సునీల్ కథానాయకుడిగా వంశీకృష్ణ ఆకెళ్ల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా... సునీల్ సరసన రొమాన్స్ చేస్తోంది. ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జక్కన్న' అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది.

గతంలో పూల రంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ మరోసారి ‘జక్కన్న'లో కూడా అలా కనిపించబోతున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాకు అగ్గిపుల్ల, సైనికుడు అనే టైటిల్స్‌ను పరిశీలించారు. అయితే చివరగా ‘జక్కన్న' టైటిల్ ఖారు చేసినట్లు సమాచారం.

English summary
Comedian turned hero Sunil has collaborated with director Veeru potla for Eedu Gold Ehe.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu