»   » రవితేజ 'కిక్' గుర్తువస్తోందేంటి? సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’ట్రైలర్

రవితేజ 'కిక్' గుర్తువస్తోందేంటి? సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారబాద్ : రీసెంట్ గా 'జక్కన్న' చిత్రంతో మన ముందుకొచ్చిన సునీల్ ప్రస్తుతం ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ఈడు గోల్డ్ ఎహే' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. సుష్మారాజ్, రీచా పనై ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బిందాస్ దర్శకుడు వీరు పోట్ల తెరకెక్కిస్తున్నాడు.

పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని చెప్తున్న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ రవితేజ కిక్ సినిమాని గుర్తు చేస్తోంది. ఓ ప్రక్క ఫన్ చేస్తూ మరో ప్రక్క మాస్క్ వేసుకుని తను అనుకున్న పనిని చేస్తూ, విలన్స్ కి ట్విస్ట్ ఇచ్చే పాత్రలో సునీల్ కనిపిస్తు న్నాడు.


రవితేజ కిక్ లో కూడా అలాగే మాస్క్ తో కనపడుతూ , మరో ప్రక్క ఫన్ చేస్తూ ఉండే పాత్రలో కనిపిస్తాడనే విషయం తెలిసిందే. అయినా ఇప్పటికే ప్రూవ్ అయిన ఈ ఫార్ములా.. ఖచ్చితంగా హిట్ కొట్టేలా , కామెడి, యాక్షన్ ని సమపాళ్లలో ఉన్నట్లు అర్దమవుతోంది. మీరూ ఈ ట్రైలర్ ని చూడండి.ట్రైలర్ ని బట్టి ఈడు గోల్డ్ ఎహే చిత్రం థ్రిల్లర్, మాస్,క్లాస్,ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్టు అర్ధమవుతోంది. కొన్నాళ్ళుగా సునీల్ కి సరైన హిట్ లేకపోగా ఈడు గోల్ట్ ఎహే చిత్రాన్ని పెద్ద సినిమాలకు పోటిగా దింపుతున్నాడంటే సినిమాపై పూల రంగడు స్దాయిలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అర్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీ పై హైప్ తేగా సినిమా పక్కా సక్సెస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.


Sunil's Eedu Gold Ehe: Theatrical trailer

షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశకి కానుకగా అక్టోబర్‌ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. "క్లాస్‌, మాస్‌ని అలరిస్తూ, థ్రిల్‌ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని" నిర్మాత చెప్పారు. "సునీల్‌ కెరీర్‌కి, మా సంస్థకి 'ఈడు గోల్డ్‌ ఎహే' సూపర్‌హిట్‌ చిత్రం అవుతుందన్న నమ్మకాన్ని" ఆయన వ్యక్తం చేశారు.


సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృథ్వీ, పోసాని, బెనర్జీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.


English summary
The theatrical trailer of 'Eedu Gold Ehe' is out. Directed by Veeru Potla and produced by AK Entertainments, the movie has Richa Panai and Sushma Raj as heroines. 'Eedu Gold Ehe' is set for release on 7th October as Dussera gift to his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu