»   » జూన్ లోనే రానున్న 'జ‌క్క‌న్న'

జూన్ లోనే రానున్న 'జ‌క్క‌న్న'

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్‌, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా వంశీ కృష్ణ అకేళ్ల దర్శకత్వంలో ఆర్‌పిఏ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి 'జక్కన్న' అనే సినిమా నిర్మాణాం లో ఉన్న సంగతి తెలిసిందే.. 'బ్యాక్‌ టు ఎంటర్‌టైన్‌' అనేది ఈ సునీల్ మూవీ కి ట్యాగ్‌లైన్‌..

ఇటీవలే విడుదల చేసిన జక్కన్న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ జరపుకున్న జక్కన టాకీ పార్ట్ పూర్తయింది. మే లో విదేశాల్లో 3 పాటల్ని, వైజాగ్ లో రెండు పాటల్ని చిత్రీకరించనున్నారు. దీంతో మే నెలాఖ‌రుకి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. త్వ‌ర‌లో ఆడియో విడుదల చేసి, జూన్ మూడ‌వ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ......

Sunil's jakkanna talkie part complete

"సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది. డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అందరినీ అలరిస్తుంది.అంటూ చెప్పారు. ఇదివరలో వచ్చిన ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఇప్పుడ్డు జక్కన్న లో కూడా అన్ని ట్విస్టులుంటాయనీ చెప్పారు..

మే 11 నుంచి విదేశాల్లో మూడు పాట‌ల్నిచిత్రీకరించనున్నారట. ఆ తర్వాత వైజాగ్ లో రెండు పాటల చిత్రీకరన జరిపితే షూటింగ్ పూర్తైనట్టే. ఈ మే నెలాఖ‌రుకి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు డ‌బ్బింగ్‌, ఎడిటింగ్ ప‌నులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వ‌ర‌లో ఆడియో విడుదల చేసి, జూన్ మూడ‌వ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు జక్కన్న...

English summary
Sunil jakkanna movie Talkies Part has completed, movie will be in theaters in June
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu