»   »  సునీల్, ఎన్ శంకర్ మూవీ "2 కంట్రీస్" రీమేక్ విశేషాలు

సునీల్, ఎన్ శంకర్ మూవీ "2 కంట్రీస్" రీమేక్ విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా "2 కంట్రీస్"కు రీమేక్ గా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల కేటీయార్ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 15 నుంచి మొదలవ్వనుంది.

Sunil - Shankar’s Film Shooting Starts From Feb 15

ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ.. "మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు వసూలు చేసిన సూపర్ హిట్ చిత్రం "2 కంట్రీస్". ఆ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సునీల్ సరసన కథానాయిక ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం. మాగ్జిమమ్ షూటింగ్ మొత్తం అమెరికాలో ప్లాన్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొద్దిగా మార్పులు చేశాం. మలయాళ వెర్షన్ కు సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందరే తెలుగు వెర్షన్ కూ సంగీతం సమకూర్చనున్నాడు. శ్రీధర్ సీపాన సంభాషణలు సమకూరుస్తున్నారు' అన్నారు.

నరేష్, సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, మాటలు: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి రమణ, నిర్మాణం-చిత్రానువాదం-దర్శకత్వం: ఎన్.శంకర్!

English summary
Hero Sunil’s film with director N Shankar will have its regular shooting to begin from February 15th in Hyderabad. Shankar who started own production house with his last movie Jai Bolo Telangana which was a blockbuster is also producing the new movie under his Maha Lakshmi Arts banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu