»   » ‘బ్రహ్మోత్సవం’లో నటించడం వీలుకాదని చెప్పిన సునీల్

‘బ్రహ్మోత్సవం’లో నటించడం వీలుకాదని చెప్పిన సునీల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం'. చిత్రంలో ఓ పాత్ర కోసం దర్శక నిర్మాతలు కమెడియన్ టర్న్‌డ్ హీరో సునీల్ ను సంప్రదించారు. అయితే తాను హీరోగా చేస్తున్న సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయడం వీలుకాదంటూ సునీల్ ఈ ఆఫర్ సున్నీతంగా తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ పాత్రలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.

బ్రహ్మత్సవం సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రంలో మహేష్ బాబు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. హీరోయిస్ సమంత మరోసారి ఈ సూపర్ స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పలు రొమాంటిక్ సీన్లను ప్లాన్ చేసాడు. గతంలో దూకుడు సినిమాలో మహేష్ బాబు-సమంత మధ్య కిస్ సీన్ ఉన్న నేపథ్యంలో ‘బ్రహ్మోత్సవం'లో కూడా ఫ్రెంచి కిస్ సీన్ ప్లాన్ చేసాడట. అయితే మహేష్ బాబు ఈ సీన్ ను రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన శ్రీమంతుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో లిప్ లాక్ సీన్ పెట్టడం వల్ల ప్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఈ సీన్ రిజక్ట్ చేసాడట.

Sunil turns down role in 'Brahmotsavam'

‘బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ సెప్టెంబర్ 20న ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

వాస్తవానిక ఈ సినిమా షూటింగ్ జులై 10 నుండి మొదలు కావాల్సి ఉంది. తర్వాత ఆగస్టు 18 నుండి మొదలు పెడదామనుకున్నారు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విషయాన్ని బట్టి సినిమా సెప్టెంబర్లో మొదలు కానుంది. ‘శ్రీమంతుడు' విడుదల ఆలస్యం కావడంతో ‘బ్రహ్మోత్సవం' షూటింగ్ కూడా అనుకున్న సమయానికి మొదలు కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
According to sources, Sunil has declined the offer in 'Brahmotsavam' politely as he has been busy with his other commitments as hero.
Please Wait while comments are loading...