»   » సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ‘కృష్ణాష్టమి’ ఫస్ట్ లుక్

సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ‘కృష్ణాష్టమి’ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్ ల తో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ ఇప్పుడు ఒక సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాడు. దీని పేరే 'కృష్ణాష్టమి'.

వాసు వర్మ దర్శకత్వం లో, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భం గా చిత్ర బృందం విడుదల చేసింది. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు.

Sunil - Vasu Varma - Dil Raju's Krishnashtami First Look Released

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

దర్శకత్వం - స్క్రీన్ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
The first look of hero Sunil's upcoming family entertainer 'Krishnashtami' was released today by the production team, on the occasion of India's Independence Day. The movie is a family entertainer that will have good comedy as well as family values.
Please Wait while comments are loading...