»   » అన్నీ ప్రక్కన పెట్టి దిల్ రాజు కే డేట్స్

అన్నీ ప్రక్కన పెట్టి దిల్ రాజు కే డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిర్మాతగా దిల్ రాజు కు ఉన్న క్రేజే వేరు. ఆయన బ్యానర్ లో చేయటానికి హీరోలంతా ఆసక్తి చూపిస్తూంటారు. తాజాగా తనకు వరస సినిమాలు ఆఫర్స్ ఉన్నా దిల్ రాజు సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సునీల్. బయిట తణికెళ్ల భరణి,గోపి మోహన్,మారుతి వంటివారికి కమిట్ మెంట్ ఇచ్చి ఉన్నా అవన్నీ ప్రక్కన పెట్టి దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని వాసు వర్మ డైరక్ట్ చేస్తున్నారు. వాసు వర్మ గతంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ ని డైరక్ట్ చేసారు. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.

జోరుమీదున్నారు సునీల్‌. ఒకదాని వెంట మరో కథని ఎంపిక చేసుకొంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే 'భీమవరం బుల్లోడు'తో విజయం అందుకొన్న ఆయన త్వరలో 'భక్తకన్నప్ప' కోసం సెట్స్‌పైకి వెళ్లబోతున్నారు. ఆ తర్వాత గోపీమోహన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు.

Sunil, Vasu Varma film to start in August

వీటితోపాటు మరో కథకి కూడా పచ్చజెండా ఊపారు. రచయిత విక్రమ్‌సిరి చెప్పిన కథ సునీల్‌కి బాగా నచ్చిందట. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకొన్నారు. విక్రమ్‌సిరి 'రేసుగుర్రం' సినిమాకి రచయితగా పనిచేశారు. సునీల్‌ శైలికి తగ్గట్టుగా పూర్తి వినోదాత్మకంగా సాగే కథని విక్రమ్‌ సిరి తయారు చేశారట. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించబోతున్నారు.

మరో ప్రక్క తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్‌' చిత్రాన్ని తెలుగులో సునీల్‌ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్‌ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం.

ఈ చిత్రానికి 'సుందర్ అండ్ కో ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం రీపొందనుంది. తెలుగులో రీమేక్‌ సినిమాలు తీయడంలో పెట్టింది పేరు... భీమనేని శ్రీనివాసరావు. ఇదివరకు ఆయన తీసిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఏడాది కిందట నరేష్‌తో 'సుడిగాడు' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

English summary
Sunil's new film in Vasu Varma’s direction will start and it is a comedy entertainer. This new movie will be produced by Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu