»   » రామ్ గోపాల్ వర్మ పీకమీద కత్తి పెట్టి దొంగలముఠాలో చేరాను..

రామ్ గోపాల్ వర్మ పీకమీద కత్తి పెట్టి దొంగలముఠాలో చేరాను..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమెడియన్ సునీల్ ఇక రామ్ గోపాల్ వర్మకు ఆస్థాన విద్వాంసుడైపోతున్నాడు. 'అప్పల్రాజు' లో హీరోగా నటించిన సునీలు, ఇప్పుడు వర్మ కేవలం ఇదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన 'దొంగల ముఠా' సినిమాలో కూడా నటించేసాడు. ఈ సినిమాలో మొదట్లో అసలు సునీల్ లేడు. దీని గురించే సునీల్ చెబుతూ, 'మా అమ్మ రామూ గారికి పెద్ద ఫ్యాను. ఆయన దర్శకత్వంలో నేను హీరోగా నటించే అవకాశం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషించింది అమ్మే! ఆ తర్వాత 'దొంగల ముఠా'లో కూడా 'నువ్వు ఏదో చిన్న పాత్రైనా చెయ్యాలిరా' అని పట్టుపట్టింది. దాంతో నేనెళ్లి రామూగారి పీకల మీద కూర్చున్నాను. ఆయనేమో క్యారెక్టర్ లేదంటారు. నేనేమో చేయాలంటాను. ఇక నా బాధ పడలేక ఏదో చిన్న పాత్ర క్రియేట్ చేసి చేయించారు. అలా ఆ 'ముఠా'లో చేరిపోయాను" అంటున్నాడు. సో... ఇక వర్మ సినిమాలన్నిట్లోనూ మనవాడుంటాడేమో చూడాలి..!

English summary
It is known news that Ram Gopal Varma is currently busy with his experimental movie Dongala Muta. Now, it is heard that the team has been joined by the duo of Sunil and Venu Madhav. The film already has Ravi Teja, Charmi, Lakshmi Manchu, Subbaraju and others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu