స్వేచ్చా జీవితంపై సునీత షార్ట్ ఫిల్మ్, సూపర్ సక్సెస్, మీరు చూసారా?
హైదరాబాద్: గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, యాంకర్‌గా పేరు తెచ్చుకున్న సునీత తొలిసారి నటించిన 'రాగం' అనే షార్ట్ ఫిల్మ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. స్వేచ్ఛగా జీవించాలనుకునే మహిళను ఈ సమాజం ఎలా చూస్తుంది? అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ నెల 7న యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్ పిల్మ్ ని ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించారు.
సునీత నటన బాగుందని, మంచి కథతో సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చారని, దర్శకుడు లఘు చిత్రాన్ని చక్కగా తీశారని వీక్షకులు యూట్యూబ్‌లో కామెంట్స్ చేశారు. 'రాగం' లఘు చిత్రంలో భాగస్వాములైన వారందరికీ సునీత తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
ఈ లఘు చిత్రంలో సునీతతోపాటు సమీర్, సాయికిరణ్ రామ్, సన శనూర్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ చైతు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశీరెడ్డి, వి.లక్ష్మి నారాయణ నిర్మించారు. ఇందులోని పాటను సునీత, సునీల్ కశ్యప్ ఆలపించారు.


Click it and Unblock the Notifications











