»   » అందర్నీ దులిపేసింది: మళ్ళీ విరుచుకు పడ్డ అన్నపూర్ణ సుంకర

అందర్నీ దులిపేసింది: మళ్ళీ విరుచుకు పడ్డ అన్నపూర్ణ సుంకర

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాల తీరును సోషల్ మీడియా ద్వారా నాడు ఏకిపారేసిన ఎన్నారై అన్నపూర్ణ సుంకర మరోమారు తెరపైకి వచ్చింది. గతం లో ఒక సారి సినీ ఇండస్ట్రీలో ఉన్న లోపాలనూ, మహిళల పట్ల సినిమా రంగం లో ఉన్న అభిప్రాయాలనూ ఉదహరిస్తూ మొత్తం హీరోలనూ దర్శకులనూ ఏకిపారేసింది. దానికి ప్రతిగా మన సినీ రంగ ప్రముఖులు కూడా చాలా "సినీ భాషలోనే సభ్యత తో కూడిన" మాటలతో ఆమెకు రిప్లై లు ఇచ్చారనుకోండి అది వేరే విషయం.

అన్నపూర్ణ సుంకర

అన్నపూర్ణ సుంకర

ఇన్నాళ్లకు మళ్లీ తెరపైకి వచ్చింది అన్నపూర్ణ సుంకర . ఆడవాళ్లు పక్కలోకే పనికొస్తారన్న చలపతిరావు కామెంట్లపై స్పందించింది. ఈ సారికూడా ఒక్క చలపతిరావుని మాత్రమే కాదు మొత్తం ఇండస్ట్రీని మరో సారి దులిపేసింది... ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకిపడేసింది. తన ఫేస్‌బుక్ పేజీలో ‘ఫ్యూ థింగ్స్' పేరిట ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అసలు పనిచేయడమే మానేసిందని, అలాంటి సంఘటనలు మళ్లీ..మళ్లీ జరుగుతున్నా ఏమీ పట్టించుకోనట్టే ఉంటోందని అసహనం వ్యక్తం చేసింది.

యాంకర్ రవి స్పందించిన విధానం

యాంకర్ రవి స్పందించిన విధానం

అంతే కాదు అప్పట్లో అన్నపూర్ణ ని విపరీతంగా కించ పరుస్తూ యాంకర్ రవి కౌటర్ ఇచ్చిన సంగతి గుర్తుంది కదా. అందుకే ఈసారి అతన్ని కూడా వదల లేదు. చలపతి రావు చేసిన మహిళలపై చేసిన కామెంట్స్‌కు యాంకర్ రవి స్పందించిన విధానం పలు విమర్శలకు తావిచ్చింది.

రవిపై కేసు

రవిపై కేసు

యాంకర్ రవి సూపర్ అని అనడంపై వివరణ ఇచ్చినప్పటికీ మహిళా సంఘాల ఆగ్రహావేశాలు చల్లారలేదు. రవిపై కేసు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో రవి ఎదుర్కొంటున్న పరిస్థితిపై అన్నపూర్ణ సుంకర స్పందించింది. కమెడియన్ ఆలీ చేసిన కామెంట్స్‌పై వీడియో పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపిన అన్నపూర్ణ సుంకర రవి పరిస్థితిపై అది అతని కర్మగా ఆమె అభిప్రాయపడింది.

మీడియా తీరుని కూడా

మీడియా తీరుని కూడా

ఇండస్ట్రీ తోనే ఆగుఇపోలేదు చలపతి రావ్ చేసిన వ్యాఖ్యలని ఏమాత్రం కట్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ప్రసారం చేసిన మీడియా తీరుని కూడా తప్పు పట్టింది. సెన్సార్ బోర్డులకు, అసోసియేషన్లకు చేతకాకపోతే, పోరంబోకు వేషాలను సెన్సార్ చేయకుండా టీవీల్లో 24 గంటలు టెలీకాస్ట్ చేస్తే.

ఉరికిచ్చి..ఉరికిచ్చి కొడతారు

ఉరికిచ్చి..ఉరికిచ్చి కొడతారు

ఇండస్ట్రీని తిట్టడం కాదు.. ఉరికిచ్చి..ఉరికిచ్చి కొడతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది అన్నపూర్ణ సుంకర. అధికారిక సంస్థలు వాటిని నియంత్రించలేనప్పుడు జనం తిరగబడతారని, అప్పుడు ప్రశ్నించే హక్కు సినీ ఇండస్ట్రీలోని ఎవరికీ లేదని ఘాటుగానే చెప్పింది.

వాగిన వెధవల వల్ల

వాగిన వెధవల వల్ల

ఇక మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌) కు ఏ మాత్రం బాధ్యత ఉన్నా.. ఈ రోజు మళ్లీ ఇలా జరిగి ఉండేది కాదని అంటూ. వాగిన వెధవల వల్ల ఇండస్ట్రీని తప్పుబట్టరని, అలా వాగి తప్పించుకునే అవకాశం ఇచ్చిన మీ బోడి సంస్కృతి, నియమాలు, విలువల వల్ల ఇండస్ట్రీని తప్పుబడుతున్నారని అంటూ చెప్పింది.

ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

తాను ఈ మాటలు ఊరికే అనట్లేదని, ఏది చూశానో అదే మాట్లాడుతున్నానని, కుళ్లిపోయి కంపుకొడుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీని శుభ్రం చేసే సమయం వచ్చిందని, కనీసం ఇప్పటికైనా స్పందించాలని కోరింది. బాహుబలి సినిమాలో తామేదో భాగమైనట్టు తెలుగు సినిమా ప్రైడ్ అని పండుగలు చేసుకుంటున్నారని, అదే చలపతిరావు, అలీ, నాగచైతన్య లాంటి వాళ్ల వల్ల తెలుగు సినిమా పరువు పోతుంటే మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించింది.

బొందలా ఉన్నాయి

బొందలా ఉన్నాయి

ఇక మీడియా చానెళ్ళు కూడా జనం చూస్తున్నారు కాబట్టి టెలీకాస్ట్ చేస్తున్నామనే వ్యాఖ్యలు బొందలా ఉన్నాయని, ఒకప్పుడు కేరల ఇండస్ట్రీ లో స్టార్ హీరోల సినిమాల కన్నా షకీల సినిమాలు బాగా డబ్బు సంపాదించి పెట్టాయని, డబ్బుకోసం అని ఆ సినిమాలని అలాగని టీవీల్లో సెన్సార్ లేకుండా వేస్తారా?మరి ఇక్కడ ఎందుకు సెన్సార్ చెయ్యరు? అని ప్రశ్నించింది.

అర్థం చేసుకోలేకపోతే

అర్థం చేసుకోలేకపోతే

తానేం చెబుతున్నానో అర్థం చేసుకోలేకపోతే, సమాజంలోని చట్టాలను అర్థం చేసుకోలేకపోతే వారిని మూర్ఖులంటారని మండిపడింది. ఇక, ఈ మొత్తం వ్యవహారంలో చలపతిరావు మినహా రారండోయ్ వేడుక చూద్దాం టీం, యాంకర్లు అంతా పిరికిపందలని, వాళ్లంతా పందులని, చలపతిరావు కరెక్ట్ పనే చేశారని చెప్పింది.

English summary
"In the whole Rarandoi Veduka Chuddam team including the anchors who hosted the show, everyone is a coward except Chalapati Rao" Posted Annapurna Sunkara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu