అలాంటి పరిస్థితి ఉంటే ఇండియాలో ఉండేదాన్నేకాదు: సన్నీ లియోన్
హైదరాబాద్: గత కొన్ని నెలలుగా ఇండియాలో మత అసహనం అంశంపై పెద్ద వివాదమే సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హయాంలో దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ప్రముఖ రచయితలు, మేధావులు, కొందరు సినీ ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాలపై వివాదాస్పద కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలో అసహనం ఉన్న మాట వాస్తవమే, నా భార్య ఈ దేశం వదిలి వెళ్లి పోదాం అని అడగుతోంది అంటూ అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ ఆయన్ను ఇబ్బందుల్లో నెట్టేసింది.

అయితే మాజీ పోర్న్ స్టార్, ప్రస్తుతం బాలీవుల్లో సెక్సీ హీరోయిన్ సన్నీ లియోన్ మాత్రం ఈ అంశంపై డిఫరెంటుగా స్పందించారు. ఆమె తన వ్యాఖ్యలతో ఆమె ఎంతో మంది హృదయాలు గెలుచుకుంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఆమె ఈ విషయమై జాగ్రత్తగా స్పందించారు.
‘అసహనం అనే పదాన్ని వాడటం ఆసక్తికరంగా ఉంది. నేను ఇండియాను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ దేశంలో అసహనం అనేది ఉండి ఉంటే నేను ఇంత సేఫ్ గా ఉండేదాన్నికాదు. ఈ దేశంలో సహనం వర్దిల్లుతోంది అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











