Just In
- 3 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 9 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 30 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 34 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Automobiles
అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. టోలిచౌక్‌లో కోలాహలం! సాయత్రం మీడియాతో సమావేశం!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సన్నిలియోన్ కి అవన్నీ..,ఫ్రెండ్స్, రిలిటివ్స్ చూడటం ఇష్టం లేదట,వద్దంటోంది
ముంబై : బాలీవుడ్ నటి సన్నీలియోని జీవిత కథతో 'మోస్ట్‌లీ సన్నీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిన సంగతి తెలిసిమందే. కరేన్‌జిత్ కౌర్ వోహ్రాగా ఓ సిక్కు కుటుంబంలో సన్నీ పుట్టినప్పటి నుంచి అడల్ట్ చిత్రాల స్టార్‌గా ఎదిగిన క్రమం, ఆ తర్వాత బాలీవుడ్‌లో తెచ్చుకున్న గుర్తింపువరకూ ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయట. కానీ ఈ డాక్యుమెంటరీని మనదేశంలో విడుదల చేయడం సన్నీకి ఇష్టం లేదు. ఇందులో తన గురించి కంటే కల్పితమే ఎక్కువ ఉందని సన్నీ లియోన్ చెబుతోంది.
సన్నిలియోన్ మాట్లాడుతూ.. ''ఈ డాక్యుమెంటరీ భారతదేశంలో విడుదల కాకపోవచ్చు. ఎందుకంటే అది నా కథ కాదు. అది ఒకరి వూహాజనితంగా ఉంటుంది'' అని చెప్పింది సన్నీ. అలాగే ..''చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఈ చిత్రాన్ని కుటుంబం, స్నేహితులతో కలిసి చూడాలనుకుంటున్నాను. ఇందులో చాలా భాగం అనవసరమైందే. దాన్నే ఈ డాక్యుమెంటరీలో చూపెడుతున్నారు''అని చెప్పింది సన్నీ.
ఈ డాక్యుమెంటరీ ఇటీవల టొరంటో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దీనికి సన్నీలియోని హాజరు కాలేదు. దీని గురించి ఆ డాక్యుమెంటరీ రూపకర్త దిలీప్ మెహతా మాట్లాడుతూ ''సన్నీ లియోని ఇందులో కొన్ని మార్పులు కోరుకున్నట్టు ఉన్నారు.. అందుకే రాలేదేమో!''అని చెప్పారు.

ఈ విషయమై సన్నీ స్పందిస్తూ ''మా ఫ్యామిలీలో ఓ వేడుక ఉండటంతో నేను వెళ్లలేకపోయాను. ఏది ఏమైనా చివరకు అది జీవిత కథ అంటున్నారు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియాల్సిందే. నా జీవితంలో నాకు నచ్చని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ డాక్యుమెంటరీలో చూపిస్తానంటే ఎలా కుదురుతుంది? నా మీద జాలిచూపించేలా ఉండే కథ అయితే అది నా కథే కాదు'' అని చెప్పింది సన్నీ. ప్రజలు అసహ్యించుకునేలా ఉండే ఓ చిత్రాన్ని కోరుకోవడం లేదని చెబుతోంది సన్నీ.
ఫైనల్ గా సన్ని చెప్తూ ...'నా లైఫ్ పై వచ్చే చిత్రాన్ని నా ఫ్రెండ్స్, రెలిటివ్స్ మధ్య కూర్చుని చూసేదిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ అందుకు భిన్నంగా ఉంది. నేను వద్దనుకున్న చాలా విషయాలు దాన్లో ఉన్నాయి. చూడొద్దనుకున్న ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. ఇది నా జీవితం కాదు. నా జీవితం మీద ఇంకొకరి అభిప్రాయం మాత్రమే ఇది' అని సన్నీ చెబుతోంది. డిసెంబరులో ఈ డాక్యుమెంటరీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరులో ముంబయిలో జరిగే మామి వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది.