»   » సన్నిలియోన్ కి మోహన్ బాబు సన్మానం

సన్నిలియోన్ కి మోహన్ బాబు సన్మానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహన్ బాబు సినిమా కంపెనీలో మర్యాదలకు ఏ మాత్రం లోటు ఉండదు. చాలా గౌరవంగా టెక్నిషియన్స్ ని, ఆర్టిస్టులను చూస్తూంటారని పేరు. తాజాగా మోహన్ బాబు కంపెనీ లో ఫోర్న్ స్టార్ సన్నిలియోన్ ...నటిస్తోంది. మంచు మనోజ్ నటిస్తున్న కరెంట్ తీగ లో ఆమె టీచర్ గా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఆమెతో షూటింగ్ పూర్తి చేసారు. ఆ షూటింగ్ పూర్తయ్యాక మోహన్ బాబు...సన్నిలియోన్ దంపతులను ఇద్దరని తనదైన శైలిలో గౌరవించి, సన్మానం తరహాలో జరిపి పంపిచారట. ఈ విషయమై సన్నిలియోన్ ఆనందపడుతూ ఈ ఫొటోని పోస్ట్ చేసింది.

పోర్న్ స్టార్ టర్న్ డ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ తెలుగులో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదీ మంచు మనోజ్ సినిమా 'కరెంట్ తీగ'లో. ఆమెకున్న ఇమేజ్‌కు, ఈ సినిమాలోని పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందట. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఆరియానా, వివియానా సమర్పిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విష్ణు నిర్మాత. అచ్చు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "మా సినిమాలో సన్నిలియోన్ నిండైన చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. కుర్రకారుకు కావాల్సిన దృశ్యాలు పాటల్లో ఉంటాయి. ఈ పాత్రకు ఆమె అయితే సరిపోతుందని భావించి సంప్రదించాం. చేయడానికి ఒప్పుకుంది. '' అని అన్నారు.

Sunny Leone gets a Gift from Mohan Babu

ఈ చిత్రం కోసం సన్నీకి మూడు రోజులు డేట్స్ కేటాయించిందని, అందు నిమిత్తం 35 లక్షలు సమర్పించారని తెలుస్తోంది. రోజుకు పది లక్షలు చొప్పున, ఖర్చులు నిమిత్తం 5 లక్షలు ఇచ్చారని సమాచారం. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.

''మనోజ్‌ ఎనర్జీని మరో స్థాయిలో చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉంటాయి'' అని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే 'కరెంటు తీగ'కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

English summary

 Sunny Leone tweeted: "Special thank you 2 Mr Mohan Babu & HeroManoj1 for gifting DanielWeber99 gorgeous haar & saying such nice things :)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu