For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సన్నిలియోన్ కు యాక్సిడెంట్..చిన్నపాటి గాయాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సన్నిలియోన్ కు షూటింగ్ లో చిన్న యాక్సిడెంట్ అయ్యింది. దాంతో ఆ బాధకు రాత్రంతా నిద్ర కరువు అయ్యిందిట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. ఆమె ట్వీట్ చేస్తూ.. నా మెడపై చిన్న దెబ్బ తగిలింది.. మెడ కదలల్చటం ఇబ్బందిగా ఉంది.. రాత్రంతా నిద్రపట్టలేదు.. చాలా ఇబ్బందిగా ఉంది. కాంబిప్లామ్ టాబ్లెట్ తీసుకుని టైగర్ బామ్ రుద్దాను... ఈ రోజు ఫస్ట్ షాట్ లోపల నా మెడ సరిగ్గా పనిచేసేలా ఏదన్నా మిరాకల్ జరిగితే బాగుండును అంటూ ట్వీట్ చేసింది. మస్తీ జాదే షూటింగ్ కోసం ఆమె పట్టాయం లో ఉంది. అక్కడ షూటింగ్ లో పొరపాటున పడి దెబ్బలు తగిలాయి.

  సన్ని లియోన్ ని పెద్ద తెరమీద చూడటానికి చూపిస్తున్న ఆసక్తిని రెట్టింపు చేయాలనుకుంటున్నారు మస్తీ జాదే నిర్మాతలు. ఆమె ద్విపాత్రాభినయంతో మస్తీ జాదే అనే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆమె కవలలు క్రింద కనిపించనుంది. సన్నిలియోన్ కెరిర్ లో ఇలా డ్యూయిల్ రోల్ చేయటం తొలిసారి. తుషార్ కపూర్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మిలాన్ జవారీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ప్రీతీష్ నంది కార్పోరేషన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  సన్నీలియోన్‌ పేరు వినగానే అందచందాల ఆరబోత, హాట్‌ హాట్‌ ముద్దు సన్నివేశాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఈ శృంగార తార ఇప్పటి వరకు పోషించిన పాత్రలు అలాంటివే. ఈ సారి సన్నీ కాస్త పద్ధతిగా కనిపించనుందని సమాచారం. దేవాంగ్‌ దొలాకియా దర్శకత్వంలో రూపొందుతున్న 'టినా అండ్‌ లోలో'లో నటనకు ప్రాధాన్య మున్న పాత్రలో కనిపించనుంది సన్ని.

  Sunny Leone met with an Accident

  దీని తర్వాత దేవాంగ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో చిత్రంలో నటించడానికి సన్నీ అంగీకరించింది. అదే 'పటేల్‌ రాప్‌'. ఈ చిత్రంలో సన్నీ సినిమా తార పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర ప్రముఖ హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మన్రోను పోలి ఉంటుంది. రామ్‌ కపూర్‌ ప్రధాన పాత్రధారి. సన్నీ నటిస్తున్న చిత్రాల్లో 'యు' సర్టిఫికెట్‌పొందే తొలి చిత్రం ఇదే కావచ్చు.

  దర్శకుడు మాట్లాడుతూ ''సినిమాలో సన్నీ లియోన్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నా ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాలుండవు. ముద్దు సన్నివేశాలకు ఆస్కారం లేదు. కుటుంబమంతా కలసి చూసేలా సన్నీ పాత్ర ఉంటుంది. మార్లిన్‌ మన్రో- జాక్‌ లెమ్మాన్‌ తరహా కెమిస్ట్రీ సన్నీ- రామ్‌ల మధ్య ఉంటుంది.అశ్లీలత లేని వినోదం ఉంటుంది''అని చెప్పారు.

  సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం 'బిగ్‌బాస్' షోలో పాల్గొని, బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయారు. ఇప్పుడామె బాలీవుడ్‌లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి.

  సన్నిలియోన్ మాట్లాడుతూ... ''నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగినవే. భారతీయ మూలాలున్న నేను అనుకోకుండా నా పదహారో ఏటనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తప్పు చేశాను. ఆ తప్పే నా జీవితంలో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పంథొమ్మిదేళ్ల వయసులో పోర్న్ మూవీ ఇండస్ట్రీలో ప్రవేశించాను. మంచిగానో చెడుగానో పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి'' అని గతాన్ని నెమరువేసుకున్నారు సన్నీ.

  మామూలు సినిమాల్లో నటించడం కష్టమా? లేక పోర్న్ సినిమాల్లో చేయడం కష్టమా? అనడిగితే -''మామూలు సినిమాల్లో నటించడం కష్టమేం కాదు. కాస్త అందం, అభినయ సామర్థ్యం ఉంటే చాలు... మామూలు సినిమాల్లో నటించేయొచ్చు. కానీ పోర్న్ ిసినిమాలు చేయడంలో మాత్రం చాలా ఇబ్బందులుంటాయి. ఇవి చెప్పుకోలేనివి. అసలు అంతమంది ముందు అలా చేయడానికే ధైర్యం కావాలి. ఎంతో మానసిక దృఢత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చాలామంది పోర్న్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. కానీ... చూసినంత తేలిక కాదు చేయడం'' అని సన్ని లియోన్ చెప్పుకొచ్చారు.

  English summary
  Sunny Leone had sustained an injury while shooting for her upcoming Bollywood flick. "Pinched a nerve in my neck! Can't move it hurts so bad. Didn't sleep all night! Worst feeling when you can't function!but everything else is great. Taken good old Combiflam and have tiger balm…praying a miracle will happen and my neck starts moving more before my first shot Today," she says.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X