»   »  నవ్వకండి బాబూ... ఇదీ మనోళ్ల తీరు, పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్ లో సన్నీ లియోన్

నవ్వకండి బాబూ... ఇదీ మనోళ్ల తీరు, పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్ లో సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటే ఇపుడు బాలీవుడ్ హాటెస్ట్ తారలు బెంబేలెత్తిపోతున్నారు. ఘాటు సన్నివేశాలను వేటినైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ కు అలాంటి పాత్రలే వస్తున్నాయి. మామూలుగానే సినీ తారలంటే ఇప్పుడు గ్లామర్ డాల్స్ అనే ముద్ర ఉంది మనదేసం లో ఇది మరీ సాంప్రదాయాలకు సంబందించిన అంశం. అసలు కుటుంబసభ్యులందరూ ఉన్న సమయం లో సన్నీ లియోన్ పేరు ఎత్తటానికే కాస్త ఇబ్బందిగా ఫీలవుతాం అలంతిది ఏకంగా పరీక్ష రాసే ప్రశ్నాపత్రం లో సన్నీ లియోన్ ఉంటే?? ప్రశ్న ఇచ్చిన వారి తప్పా..?? లేక మనం ఇంకా అలాంటివి లైట్ తీసుకునే స్థాయికి చేరుకోలేదు అనుకోవాలా??

 Sunny leone Name in PSC Exam Question Paper

కేరళలో సరిగ్గా ఇదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్ లో ఇచ్చే ప్రశ్న అంటే ఎలా ఉండాలి. కానీ కేరళలో మాత్రం అలాంటి మొహమాటలు ఏమీ లేనట్టు ఉన్నాయ్. కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎగ్జామ్ (PSC) క్వశ్చన్ పేపర్లో ఎవరూ ఊహించని ప్రశ్న ప్రత్యక్షమైంది. "ఆల్ఫాబెట్ సూప్ ఫర్ లవర్స్" అనే బుక్ రచయిత ఎవరంటూ మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ గా సన్నీలియోన్ పేరు ప్రింట్ చేశారు. అంతే క్వశ్చన్ పేపర్ చూసి షాకవడం అభ్యర్థుల వంతైంది. తేడా వస్తే జనాలు ఏం అనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా ఇలా ఎవరు పడితే వాళ్ల పేర్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

 Sunny leone Name in PSC Exam Question Paper

మామూలుగానే ఇలాంటిది జరిగిందని చెబితే నవ్వువస్తుంది కానీ ఒక రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షా ప్రశ్నా పత్రం లోనే ఒక పోర్న్ స్టార్ పేరు కనిపించటం ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. గూగుల్ సెర్చింగ్‌ యాక్టర్లలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సన్నీలియోన్ టాప్ ప్లేస్‌లో నిలిచారు.మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలో లోని హీరోల్లో చూసుకుంటే సల్లు భాయ్ గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్‌లో టాప్ ప్లేస్ లో ఉండగా.. హీరోయిన్లలో సన్నీ మొదటి స్థానాన్ని కొట్టేసింది.ఏకంగా గత దశాబ్ద కాలంలో గూగుల్ లో ఎవరిని ఎక్కువగా వెతికారనే విషయమై గూగుల్ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. ఎంత పదేళ్ళలో మోస్ట్ పాపులర్ అయిపోయిన నటి అయినా ఇలా ప్రశ్నా పత్రం లో ఒక పోర్న్ స్టార్ పేరు వేయటం మత్రం వివాదానికి తెర తీసింది.

English summary
Sunny Leone Name as an option for a multi full choice Question in Kerala state Public Service Commission Exam Paper
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu