»   » హైదరాబాద్ వాళ్లే సన్నిలియోన్...హార్డ్ కోర్

హైదరాబాద్ వాళ్లే సన్నిలియోన్...హార్డ్ కోర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మన హైదరాబాద్ వాళ్లకే తనంటే అంటే విపరీతమైన పిచ్చి, అభిమానం అని తేల్చి చెప్పింది సన్ని లియోన్. ఆవిడ తన తాజా చిత్రం "కుచ్ కుచ్ లోచా హై" చిత్రం ప్రమోషన్ కు వచ్చినప్పుడు ఇక్కడ వీరాభిమానుల హంగామా చూసి షాకైందిట. ఆవిడ... హైదరాబాద్ లోని ఓ మాల్ కు వెళ్లగానే ఆమెకు వెల్ కమ్ చెప్తూ ఫ్యాన్స్ చుట్టిముట్టడం ఆనందంతో ముంచెత్తింది. ఈ విషయమై ఆమె ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సన్ని ట్వీట్ చేస్తూ..."నేను హైదరాబాద్ అభిమానుల పిచ్చి కు ఆశ్చర్యపోయాను...ఈ దేశంలో ఎక్కడా ఇటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని చూడలేదు. వీళ్లంతా నా తాజా చిత్రం కుచ్ కుచ్ లోచా హై చూసి,ఇష్టపడతారని ఆశిస్తాను " అని తెలియచేసింది. ఈ రోజే ఈ చిత్రం విడుదల అవుతోంది.

సన్నీలియోన్‌ గురువారం సాయంత్రం కేపీహెచ్‌బీకాలనీలోని మంజీరామాల్‌లో సందడిచేశారు. తాను నటించిన హిందీ చిత్రం కుచ్‌కుచ్‌లోచాహై సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్‌ సెల్ఫీ విత్‌ సన్నీ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలుగులో అందరికీ నమస్కారం అంటూ యువతను ఉత్సహపరిచారు.

సన్నిలియోన్ మాట్లాడుతూ...హైదరాబాద్‌కి గతంలో నాలుగైదుసార్లు వచ్చాను కానీ ఇక్కడ ఏ ప్రాంతాన్నీ చూసే అవకాశం దక్కలేదు. తెలుగు సినిమా షూటింగ్‌ ఫిల్మ్‌సిటీలో జరిగింది. నేను చూసిన ఫిల్మ్‌సిటీలలో అత్యుత్తమమైన వాటిలో ఇది ఒకటి. ఇక ఇక్కడ స్నేహితులంటారా.. షూటింగ్‌ కోసం లేదంటే ప్రమోషన్‌ కోసం వచ్చి వెళ్లిపోవటం వల్ల ఎవరూ లేరు అన్నారామె.

ఇక ఇండియా వచ్చిన తరువాత నన్ను అభిమానించి, ప్రోత్సహిస్తున్న వారు ఉన్నట్లే... వ్యతిరేకిస్తున్న వారూ ఉన్నారు. అందరి ప్రోత్సాహం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నానని మాత్రం చెబుతాను అని అంది.

సాధారణంగా ..సన్నీ లియోన్ అంటే హాట్‌ హాట్‌ అందాలు గుర్తొస్తాయి కానీ ఈ సారి కామెడీ తో అదరకొడతా అంటోంది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ స్ధానం ఏర్పాటు చేసుకుంటున్న ఈ భామ తాజాగా 'కుచ్‌ కుచ్‌ లోచాహై' అనే ఓ అడల్ట్‌ కామెడీ చిత్రంలో నటించింది. అందుకే తనూ ఓ మంచి కమెడియన్‌ అని మురిసిపోతోంది. ఈ చిత్రంలో తను కడుపుబ్బా నవ్విస్తానంటోంది.

సన్నిలియోన్ మాట్లాడుతూ...''నేను అమెరికాలో ఉన్నపుడు ఓ కామెడి స్కిట్ లు చేసే గ్రూప్ లో సభ్యురాలిగా ఉండేదాన్ని. పలు హాస్యనాటికల్లోనూ నటించాను. అందుచేత హాస్యం పండించడం నాకు కష్టమనిపించలేదు. ఎలాగూ నాకు మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందని అందరూ అంటుంటారు ''అని మురిసిపోతూ చెప్పింది.

ఇక ''కుచ్‌ కుచ్‌..' సన్నీలియోని సినిమానా?' అని అడిగితే ''లేదు...కుటుంబ కథా చిత్రం. సరదా సరదాగా సాగుతుంది'' అని చెప్పింది. ఈ నెల 8న 'కుచ్‌ కుచ్‌...' విడుదల కానుంది. ట్విస్ట్ ఏమిటంటే... ఈ సినిమాలో ద్వంద్వార్థ సంభాషణలు మితిమీరి ఉండటంతో ఏం చేయాలో తెలియక సెన్సార్‌ బోర్డువారు డైలామాలో పడ్డారట.

Sunny Leone on madness of Hyd fans

బాలీవుడ్ లో ఇప్పుడు సెక్సీ లేడీ స్టార్ సన్నిలియోన్ హవా నడుస్తోందని బాలీవుడ్ హీరోలు కూడా ఒప్పుకుంటున్నారు. ఈ హాట్ బ్యూటీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఏక్ పహెలీ లీలా సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకోగా.. లేటెస్ట్ గా అంతర్జాలంలో రిలీజైన సన్నీ నయా మూవీ కుచ్ కుచ్ లోచా హై టీజర్ కూడా సన్నీ ఫ్యాన్స్ ను ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తోంది... కొద్ది రోజుల క్రితం రిలీజైన ఈ ట్రైలర్ చూసిన వారంతా... ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే లాభాల బాట పట్టడం ఖాయమని అంటున్నారు.

కుచ్ కుచ్ లోచా హై ట్రైలర్ చూసిన వారికి.. ఈ సినిమా ఓ సెక్సీ ఎంటర్ టైనర్ అని ఈజీగా అర్థమవుతుంది. టీనేజ్ కుర్రాడికి తండ్రి అయిన ఓ వ్యక్తి.. సన్నీలియోన్ వంటి హాట్ బ్యూటీ మాయలో పడి.. ఎలాంటి వింత వేషాలు వేషాడన్నదే ఈ మూవీ స్టోరీ. ట్రైలర్ చూడగానే క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.... కానీ ఈ సినిమాలో సన్నీ లియోన్ హాట్ హాట్ అందాలు ఎలా ఉంటాయని భావించే వారికి మాత్రం ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది.

ఇందులో సన్నీ అందాల ఆరబోత పీక్ స్టేజ్ కు చేరుకుందని కొన్ని సీన్లు చెప్పకనే చెప్పాయి... అందుకేనేమో టీజర్ వచ్చిన రెండు రోజుల్లోనే మిలియన్ హిట్స్ ను దాటి స్టార్ హీరోల రేంజ్ లో దూసుకుపోతోంది.... సినిమాలో 45 ఏళ్ల వ్యక్తిని తనవైపు తిప్పుకున్న సన్నీ.. ఈ సినిమా ద్వారా ఆ ఏజ్ అంకుల్స్ అందరినీ అట్రాక్ట్ చేసి సినిమా ఘన విజయానికి దోహదపడుతుందేమో చూద్దాం.

English summary
“I’m amazed by the madness of Hyderabad fans. No where in India i’ve see such hardcore film lovers. I hope they will all like my latest movie Kuch Kuch Locha Hai”, said Sunny Leone, sharing her thoughts with Telugu media. On May 8th, this flick is releasing across the globe.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu