»   » ఆ యాడ్ మరీ ఆడ్ గా ఉందీ: సన్నీ కండోమ్ యాడ్ పై మళ్ళీ రేగిన వివాదం

ఆ యాడ్ మరీ ఆడ్ గా ఉందీ: సన్నీ కండోమ్ యాడ్ పై మళ్ళీ రేగిన వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్కోసారి వివాదాలు కూడా గమ్మత్తుగా ఉంటాయి. ఒక హీరో క్లబ్ సోడా పేరుతో లిక్కర్ తాగమంటూ ప్రోత్సహిస్తే ఏ గొడవా ఉండదు, మరో క్రికెటర్ దేశం లోనే అత్యంత పెద్ద నేరాల్లోనే ఒకటైన వేలకోట్ల మోసం చేసిన కంపెనీ స్పాన్సర్ షిప్ లో ఆడినా ఎవ్వరూ పట్టించుకోరు కానీ ఇప్పుడు సన్నీ లియోన్ చేసిన ఒక కండోం యాడ్ మాత్రం దేశవ్యాప్తంగా విమర్షలను ఎదుర్కొంటోంది.

వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్

వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్

ఫోర్స్ కండోం కంపెనీ కోసం సన్నీ చేసిన ఒక యాడ్ ఫిలిం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.... మామూలుగా ఇలాంటి యాడ్ లకోసం పెద్దగా పేరు లేని మోడల్స్ మాత్రమే సాహసించేవాళ్ళు కానీ ఈసారి ఒకప్పటి వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్ అయిన సన్నీ కనిపించటం తో ఈ యాడ్ కి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసింది....

ఒక షార్ట్ ఫిలిం లాగా

ఒక షార్ట్ ఫిలిం లాగా

అందులోనూ ఇది మామూలుగా తీసే యాడ్ లా అరనిమిషం కాకుండా ఒక షార్ట్ ఫిలిం లాగా తీసారు. తన జోన్‌ కావడం వలనో ఏమో సన్నిలియోన్‌ ఒక రేంజ్‌లో అదరగొట్టింది. ఆమె ఎక్స్ప్రెషన్లు ఈ యాడ్ కి మరో యాడెడ్ ఎట్రాక్షన్ అవటం తో విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది ఫోర్స్ కంపెనీకి.

మహిళా సంఘాలకి నచ్చలేదు

మహిళా సంఘాలకి నచ్చలేదు

అయితే కాస్త మసాలా ఘాటు ఎక్కువ కావటం తో ఇది మహిళా సంఘాలకి నచ్చలేదు. ఈ యాడ్‌ని తక్షణం బ్యాన్‌ చేయాలంటూ గొడవ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రచ్చ చాలా కాలంగా జరుగుతున్నా ఈమధ్య కాస్త తీవ్రత ఎక్కువైంది. ఈ యాడ్ మరీ ఆడ్ గా ఉందంటూ దీన్ని నిషేదించాలన్న డిమాండ్ ఎక్కువయ్యింది. మరీ అలాంటి ఎక్స్ప్రెషన్లని టీవీలో చూడటమూ కష్టమే కదా

సన్నీ రంగం లోకి దిగింది

సన్నీ రంగం లోకి దిగింది

దాంతో ఇక తప్పదనుకుందో ఏమో గానీ సన్నీ రంగం లోకి దిగింది. తాను నటించిన యాడ్ మీద తన అభిప్రాయం ఏమిటో చెప్పేసింది ఇండియా డెమాక్రటిక్‌ కంట్రీ కనుక ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు నిర్మొహమాటంగా వ్యక్తం చేయవచ్చునని, ఎవరు ఏమనుకున్నా తానేమీ బాధ పడనని, ఒకవేళ ఆ యాడ్‌ అభ్యంతరకరంగా వుందనిపిస్తే ప్రభుత్వమే దానిని నిలిపి వేస్తుందని చెప్పింది.

కండోమ్స్‌ వాడడం వల్ల మంచే కానీ చెడు జరగదు

కండోమ్స్‌ వాడడం వల్ల మంచే కానీ చెడు జరగదు

తను పది ప్రాడక్టులు ఎండార్స్‌ చేస్తున్నానని, కానీ దీనిని మాత్రం సింగిల్‌ అవుట్‌ చేయడమేంటో తనకి అర్థం కావడం లేదని, కండోమ్స్‌ వాడడం వల్ల మంచే కానీ చెడు జరగదు కదా అంటూ నిజాన్ని చక్కగానే చెప్పేసింది. కీనీ ఇది కవరింగ్ తప్ప నిజం కాదని అందరికీ తెలుసు. కండోం యాడ్ ని పోర్న్ సినిమా లాగా కాకుండా మామూలుగా కూడా తీయవచ్చు.

లోపల్లోపల ఎంజాయ్ చేస్తూనే

అయితే మనదేశం లో ఇంకా కండోం అనే మాటనే బహిరంగంగా అనటాన్ని అంగీకరించలేని జనం కాస్త శృతి మించినట్టు గానే ఉన్న ఈ యాడ్ ని మాత్రం లోపల్లోపల ఎంజాయ్ చేస్తూనే పైకి మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం అంటూ ఆ యాడ్ ని నిలిపి వేయాలంటూ ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు.

English summary
The petition has been viewed, and the Goa State Commission has directed the state-run Kadamba Transport Corporation Limited (KTCL) to remove condom advertisements featuring actress Sunny Leone from its buses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu