For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సన్నిలియోన్ చేయటం వేస్ట్ అంటున్నారు

  By Srikanya
  |

  ముంబై : సన్నిలియోన్ సినిమాలో నటిస్తోందంటే ఓ వర్గం ప్రేక్షకులకు ఆ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోకపోతే ఆ సినిమా ఫలితం దారుణంగా ఉంటుందని గతంలో నిరూపించాయి. అయితే తాజాగా ఆమె నటించిన చిత్రం టీజర్ కూడా తమను అసంతృప్తికి గురి చేసిందని అభిమానులు కంప్లైంట్ చేస్తున్నారు. ఆమె సినిమాకు వెళ్లేదే... తెర నిండా 'అందాల ఆరబోత'కు, శృంగార దృశ్యాలకు లోటుండదని. అలా ఆశించిన వీరాభిమానులకు అనుకోని నిరాశే ఎదురైంది.

  తాజాగా విడుదలైన 'రాగిణి ఎంఎంఎస్ 2' ట్రైలర్ చూశాక సన్నీ అభిమానులు నిజంగానే కంగుతిన్నారు. సన్నీ లియోన్ 'ఇంత దారుణం'గా తమను అసంతృప్తికి గురి చేస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆమె అభిమానులు తిట్టుకుంటున్నారు. స్నానం చేయడం.. ఆ తర్వాత ఆత్మలా మారడం.. అంతా చీకట్లో చిత్రీకరించినట్లు ఉందని, ఎలాంటి 'హాట్ సీన్స్ 'కు అవకాశం లేకుండా ఆమె నటించడంతో 'ట్రైలర్'ను చూసి అభిమానులు నీరసపడ్డారు. చీకట్లో ఆమె కనుమరుగవుతుండగా- 'ఆత్మ దెబ్బ రుచి చూడాలని ఉందా..?'- అని ట్రైలర్ చివర్లో ఓ వాక్యం ప్రత్యక్షం కావడంతో అభిమానులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  ట్రైలర్ చూశాక నిజంగానే తాము 'షాక్'కు గురయ్యామని, ఇక ప్రత్యేకించి 'ఆత్మ' తమను భయపెట్టాల్సిన అవసరం లేదని వారు మైక్రో నెట్ వర్కింగ్ సైట్స్ లో వ్యాఖ్యానిస్తున్నారు. హారర్, సెక్స్ ప్రధానాకర్షణలుగా నిర్మిస్తున్న 'రాగిణి ఎంఎంఎస్ 2' వచ్చే ఏడాది జనవరి 17న విడుదల కాబోతోందని దర్శక,నిర్మాతలు ప్రకటించారు. 2011లో వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్'కు సీక్వెల్‌గా దీన్ని నిర్మిస్తున్నారు.

  ఓ పురాతన భవనం వద్ద షూటింగ్ జరిపేందుకు వెళ్లిన సినీ బృందానికి ఎదురయ్యే చేదు అనుభవాలు, వారిని వెంటాడే 'ఆత్మ'కు సంబంధించి కథాంశం కావడంతో 'రాగిణి ఎంఎంఎస్ 2' ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని దర్శక, నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తగినన్ని 'హాట్ సీన్స్ ' లేకుండా తీస్తే- ఈ సినిమాలో సన్నీ నటించడం ఎందుకని ఆమె అభిమానులు అంటున్నారు. మరి నిర్మాతలు ఈ కంప్లైంట్స్ ని పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

  'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌కి పరిచయం అయిన కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ . ఈమె అమెరికాలో నీలి చిత్రాల్లో నటించింది. పూజా భట్‌ దర్శకత్వంలో రూపొందిన 'జిస్మ్‌-2'తో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమె చుట్టూ దర్శక,నిర్మాతలు తిరగటం మొదలెట్టారు. అయితే ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. రామ్ గోపాల్ వర్మ వంటి దర్సకుడుకి సైతం డేట్స్ ఇవ్వని ఆమె ఈ చిత్రంలో నటించటంతో అంతటా ఆసక్తి నెలకొంది.

  English summary
  With Sunny Leone on board, one expects a heavy dose of bold and sensuous scenes and the trailer gives us all that (right from the shower scene to Sunny's unzipping act), but the effect is not as expected. Horror and sex go hand in hand, but rarely do filmmakers get it right.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more