»   » అయ్యో... సన్నిలియోన్ ని ఇదేంటి..ఇలా (ఫొటో)

అయ్యో... సన్నిలియోన్ ని ఇదేంటి..ఇలా (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:పోర్న్ స్టార్ టర్న్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ తెలుగులో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదీ మంచు మనోజ్ సినిమా 'కరెంట్ తీగ'లో. ఆమెకున్న ఇమేజ్‌కు, ఈ సినిమాలోని పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందట. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఆమె ఇమేజ్ కు భిన్నంగా ఆమె చీర కట్టుతో కనిపించి ఆశ్చర్యపరిచింది.

ఆరియానా, వివియానా సమర్పిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విష్ణు నిర్మాత. అచ్చు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ఆమె సరసన సంపూర్ణేష్ బాబు కనిపించనున్నారు. ఆమె భర్తగా వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు కామెడీని పంచుతాయంటున్నారు.

Sunny Leone Saree look for Current Teega

దర్శకుడు మాట్లాడుతూ "మా సినిమాలో సన్నిలియోన్ నిండైన చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. కుర్రకారుకు కావాల్సిన దృశ్యాలు పాటల్లో ఉంటాయి. ఈ పాత్రకు ఆమె అయితే సరిపోతుందని భావించి సంప్రదించాం. చేయడానికి ఒప్పుకుంది. '' అని అన్నారు.

ఈ చిత్రం కోసం సన్నీకి మూడు రోజులు డేట్స్ కేటాయించిందని, అందు నిమిత్తం 35 లక్షలు సమర్పించారని తెలుస్తోంది. రోజుకు పది లక్షలు చొప్పున, ఖర్చులు నిమిత్తం 5 లక్షలు ఇచ్చారని సమాచారం. తెలుగులో సన్నీ ఒప్పుకొన్న మొదటి చిత్రమిదే కావటంతో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారు. హీరోయిన్ కి కూడా అంత ఇవ్వటం లేదని అంటున్నారు. అంత రెమ్యునేషన్ అనే సరికి మొదట వెనకంజ వేసారని, అయితే మనోజ్ పట్టుపట్టి మరీ ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ... సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర వుంది. దీనికోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని చాలా మందిని వెతికాం. అయితే అందులో నెంబర్‌వన్ ఎవరున్నారా అని వెతికితే సన్నీలియోన్ కనిపించింది. ఈ సినిమా కోసం ఆమెనే తీసుకోవడానికి ఆమెకున్న క్రేజ్ కారణం. అంతే కాకుండా ఇందులోని పాత్ర ఆమె లాంటి నటి చేస్తేనే బాగుంటుందని భావించి సన్నీలియోన్‌ను తీసుకోవడం జరిగింది అన్నారు.

''మనోజ్‌ ఎనర్జీని మరో స్థాయిలో చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉంటాయి'' అని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే 'కరెంటు తీగ'కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

English summary
This is the pose of Sunny in the sets of her Telugu debut movie Current Teega .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu