»   » ఆ యాడ్ లలో ఇక నటించను: సన్నీలియోని

ఆ యాడ్ లలో ఇక నటించను: సన్నీలియోని

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఫ్యాన్స్ ఆరోగ్యంపై అందాలతార సన్నీలియోని శ్రద్ధ పెట్టారు. వారి ఆరోగ్యానికి హాని చేసే పాన్‌మసాలాల వ్యాపార ప్రకటనల్లో నటించనని ప్రకటించింది. ఇటీవల దిల్లీ ప్రభుత్వం పాన్‌మసాలల ప్రకటనలకు చేయవద్దని సెలబ్రిటీలను కోరింది. దీనికి స్పందించి సన్నీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని నేడు ఆమె భర్త డేనియల్‌ దిల్లీ ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిని తాము సహకరిస్తామని ఆయన చెప్పారు.

సన్నిలియోన్ చిత్రాల విషయానికి వస్తే...

సన్నీ లియోన్ హీరోయిన్ గా నటించిన తాజా హిందీ చిత్రం 'మస్తీ జాదే'. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం మస్తీ మస్తీగా ఉంటుందట. అంటే.. జోరుగా హుషారుగా అన్నమాట. అసలు సన్నీ సినిమాలంటేనే ఈ రెండూ కామన్. కానీ, ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఉన్న హుషారు ఓ ఎత్తు.. ఈ చిత్రంలో ఉన్నది మరో ఎత్తు అంటున్నారు నిర్మాతలు.

Sunny Leone says 'won't endorse pan masala'

ఈ చిత్రం విశేషం ఏమిటంటే... సన్నీ ఏకంగా 27 బికినీల్లో కనిపించి, కనువిందు చేయనుంది. మిలప్ జవేరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సభ్యులు చూసి ఖంగు తిన్నారు. అంత బోల్డ్‌గా ఉంటుందట. సెన్సార్ బోర్డ్‌కు చెందిన మొదటి రెండు బోర్డ్స్ ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించాయి.

తుషార్ కపూర్ టీమ్ చేసిన వందకోట్లు వసూళ్ల 'గ్రాండ్ మస్తీ' చూసి ఎంజాయ్ చేశారు బాలీవుడ్ ప్రేక్షకులు. మళ్లీ అదే టీం 'మస్తీ జాదే' అనే అడల్ట్ కామెడీ అంటూ వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్... తుషార్ కపూర్ అరటి పండుతో, రాకెట్ ‌తో దిగిన కామెడీ పోస్టర్లు కొద్దిగా అతిగా ఉన్నా... టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. వీటికితోడు ఈ సినిమాలో హీరోయిన్‌గా సన్నీలియెన్ నటిస్తోంది. ఇంకేం.. మస్తీ మజా గ్యారంటీ అంటున్నారట బాలీవుడ్ ఆడియెన్స్.

English summary
In a welcome response to Delhi government's appeal for non-endorsement of pan masala, actor Sunny Leone has informed that she will not sign any future contracts for endorsement of such products.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu