»   » రాజశేఖర్‌తో సన్నీలియోనీ రొమాన్స్.. పల్లెటూరి అమ్మాయిగా.. ఐటంసాంగ్..

రాజశేఖర్‌తో సన్నీలియోనీ రొమాన్స్.. పల్లెటూరి అమ్మాయిగా.. ఐటంసాంగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోనీ మరోసారి తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నది. ప్రముఖ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న పీఎస్వీ గురుడ వేగ చిత్రంలోని ఓ ప్రత్యేకపాటలో సన్నీలియోనీని ఎంపిక చేశారు. ఈ పాట కోసం సన్నీకి భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ముంబైలో షూటింగ్..

ముంబైలో షూటింగ్..

సన్నీలియోనీ పాటను ముంబైలోని ఓ స్టూడియోలో ఖరీదైన సెట్‌ను డిజైన్ చేస్తున్నారు. బాలీవుడ్ చిత్రం రామ్‌లీలా నృత్యాన్ని సమకూర్చిన విష్ణుదేవా కొరియోగ్రఫీని అందించనున్నారు. అయితే సన్నిలియోన్‌ను కేవలం పాట కోసమే ఎంపిక చేయలేదని, ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నట్టు మారో వార్త ప్రచారమవుతున్నది.

గతంలో కరెంట్ తీగలో..

గతంలో కరెంట్ తీగలో..

పీఎస్వీ గురుడవేగ చిత్రం ద్వితీయార్థంలో వచ్చే పాటను సన్నిలియోనీతో ముంబైలో షూట్ చేయనున్నారు. గతంలో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ చిత్రంలో సన్నీలియోనీ ఐటంసాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే.

రయీస్‌లో లైలా ఓ లైలా

రయీస్‌లో లైలా ఓ లైలా

శృంగార తార సన్నీ లియోనీ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఐటం సాంగులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నది. ఇటీవల షారుక్ చిత్రం రయీస్‌లో లైలా ఓ లైలా అనే సినిమాలో ఐటం సాంగ్‌లో నటించింది. 80వ దశకం నాటి చిత్రం ఖుర్బానీలోని పాటను మళ్లీ రయీస్‌లో చిత్రీకరించారు.

దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు

దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు

పోలీస్ కథా నేపథ్యంలో రూపొందుతున్న పీఎస్వీ గరుడవేగ 126.18M చిత్రంలో రాజేశేఖర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘విశ్వరూపం' ఫేమ్ పూజాకుమార్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, అదితి అరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. గుంటూరు టాకీస్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

English summary
Bollywood Sex bomb Sunny Leone's Tollywood second venture for getting ready. She gearing up to romance with Hero Rajashekar. This hottie will be seen shaking her leg with hero Rajasekhar for the upcoming film PSV Garudavega, by Praveen Sattaru of Guntur Talkies fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu