»   »  దత్తపుత్రిక ఫొటోవల్లే చిక్కుల్లో సన్నీ లియోన్: చిన్నారి ప్రైవసీకి భంగం అంటూ ఆగ్రహం

దత్తపుత్రిక ఫొటోవల్లే చిక్కుల్లో సన్నీ లియోన్: చిన్నారి ప్రైవసీకి భంగం అంటూ ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ తార సన్నీ లియోన్‌, ఆమె భర్త డేనియల్‌ వెబర్‌ ఓ పాపను దత్తత తీసుకున్నారు. 21 నెలల ఆ పాపకు నిషా కౌర్‌ వెబర్‌ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని మొదటగా మరో తార షెర్లీన్‌ చోప్రా బయటపెట్టింది. ''నిషాకౌర్‌ వెబర్‌ అనే లిటిల్‌ ఏంజెల్‌ను తమ జీవితాల్లోకి సన్నీ లియోన్‌, డేనియల్‌ వెబర్‌ ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆరాధనీయ కుటుంబానికి మరింత ప్రేమ, శక్తి చేకూరుతున్నాయి'' అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఆమె వెల్లడించింది. నిషా అనే చిన్నారిని దత్త తీసుకున్న సన్నీలియోన్‌, ఆ చిన్నారికి నిషా కౌర్‌ వెబర్‌ అని పేరు పెట్టింది. 'కౌర్‌', సన్నీలియోన్‌ అసలు పేరు. కరణ్‌జీత్‌ కౌర్‌ వోరా - సన్నీలియోన్‌ అసలు పేరు కావడంతో, అందులోంచి 'కౌర్‌' అనే పదాన్నీ, తన భర్త డేనియల్‌ వెబర్‌లోని 'వెబర్‌'నీ తీసుకుని దత్త పుత్రిక నిషాకి ఆ రెండిటినీ లింక్‌ చేశారన్నమాట.

ఆమె మీద విరుచుకు పడ్డారు

ఆమె మీద విరుచుకు పడ్డారు

అయితే సన్నీ ఈ విషయం చెప్పగానే నెట్ లో ఆమె మీద విరుచుకు పడ్డారు కొందరు. ఈ బాలిక‌ను పోర్న్ స్టార్ గా మారుస్తారా అంటూ సన్నీ మీద దాడి మొదలు పెట్టారు., అసలు ఇలాంటి వాళ్ళకు పాపను దత్తత తీసుకునే పర్మిషన్ ఇవ్వకూదదు అంటూ ప్రధాని మోడీ కి ఉచిత సలహా కూడా ఇచ్చారు కొందరు.

ఏ మాత్రం స‌బ‌బు కాదు

ఏ మాత్రం స‌బ‌బు కాదు

అయితే స‌న్నీ ద‌త్త‌త తీసుకోవ‌డంపై ప‌లువురు సెల‌బ్రిటీలు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే పోర్న్ స్టార్ అయిన స‌న్నీ చిన్నారిని ఎలా ద‌త్త‌త తీసుకుంది, దీనిపై బాలీవుడ్ సెల‌బ్రిటీస్ వెంట‌నే స్పందించారు. ఒక అనాధ‌ని చేర‌దీసి ఆమెకి మంచి లైఫ్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో వారు ద‌త్త‌త తీసుకుంటే ఇలా త‌ప్పుడు మాట‌ల‌తో ఎదుటివారిని కించ‌ప‌ర‌డం ఏ మాత్రం స‌బ‌బు కాదు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటువంటి చౌక‌బారు కామెంట్స్ మానాల‌ని హిత‌వు ప‌లికారు.

ఇంకో రూపం లో సన్నీ కి సమస్య

ఇంకో రూపం లో సన్నీ కి సమస్య

ఇదంతా కాస్త సద్దుమనిగిందీ అనుకుంటే ఇప్పుడు ఇంకో రూపం లో సన్నీ కి సమస్య మొదలయ్యింది. అదేమిటంటే తాము పాపని దత్తత తీసుకున్నట్టు చెబుతూ ఆ చిన్నారితో కలసి ఉన్న ఫొటోని పోస్ట్ చేయ్యటమే సన్నీకి సమస్యలను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి ఫొటోను, ఆమె రంగు, రూపురేఖలను బయటపెట్టడం ద్వారా ఆమె ప్రైవసీ (గోప్యత) కి భంగం కలిగించారంటూ కేంద్ర ప్రభుత్వంలోని సీఏఆర్ఏ (సెంట్రల్ అడాప్షన్ అథారిటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాలల హక్కుల పరిరక్షణ కమిటీకి ఫిర్యాదు

బాలల హక్కుల పరిరక్షణ కమిటీకి ఫిర్యాదు

ఈ నేపథ్యంలో జువైనల్ జస్టిస్ యాక్ట్ ను ఉల్లంఘించారంటూ వారిపై మండిపడింది. దీనిపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే, చిన్నారిని దత్తత తీసుకున్నందుకు వారిని అభినందిస్తూనే సీఏఆర్ఏ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఒక చిన్నారిని దత్తత తీసుకుని ప్రశంసలందుకున్న సన్నీలియోన్ పాప విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి లీగల్‌గా చిక్కులపాలైంది.

English summary
After Sunny leone put up the picture, The Central Adoption Resource Authority shared it and thus violated the Juvenile Justice Act. They made provocative comments on the shared picture as they praised the actress. They are even accused of making 'unpleasant and objectionable' statements on the share.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu