»   » సోషల్ మీడియాని కుదిపేస్తున్న సన్నీలియోన్.. పవన్ కళ్యాణ్ ఫోజులో సంచలనం !

సోషల్ మీడియాని కుదిపేస్తున్న సన్నీలియోన్.. పవన్ కళ్యాణ్ ఫోజులో సంచలనం !

Subscribe to Filmibeat Telugu
Sunny Leyone Stunning Look In Pawan Kalyan Style

శృంగార భామగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న సన్నీలియోన్ ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా శృంగార బ్రాండ్ ఇమేజ్ ఉన్న తారలకు పెద్దగా పబ్లిసిటి అవసరం లేదు. ఇటువంటి వారికి యువతలో భారీ క్రేజ్ ఉంటుంది. ఆల్రెడీ శృంగార చిత్రాలతో జగమెరిగిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి వచ్చేసరికి పెద్ద స్టార్ గా అవతరించింది. ఇటలీ పాటలు, శృంగార ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సన్నీ పాప ఆయుధంలా మారింది. బాలీవుడ్ లోనే కాదు నెమ్మదిగా ఈ భామ తన శృంగార మంత్రాన్ని సౌత్ చిత్రసీమపై కూడా జల్లుతోంది. పవన్ కళ్యాణ్ ఫోజులో సన్నీలియోన్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

 బాలీవుడ్ ని కుదిపేసింది

బాలీవుడ్ ని కుదిపేసింది

ఒకప్పుడు మల్లికా శరావత్.. ఇప్పుడు సన్నీ లియోన్ అణా రేంజ్ లో ఈ భామ శృంగార బ్రాండ్ విస్తరించింది. బాలీవుడ్ లో జిస్మ్ వంటి హాట్ రొమాన్స్ చిత్రాలు, మరియు ఐటెం సాంగుల్లో ఈ భామ చెలరేవుతున్న వైనం కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది.

 సౌత్ లో పాగా వేసే ప్రయత్నం

సౌత్ లో పాగా వేసే ప్రయత్నం

బాలీవుడ్ లోనే కాదు దక్షణాది చిత్ర పరిశ్రమల్లో కూడా తన హవా కొనసాగాలని సన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2014 లో కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో సన్నీ మెరిసింది. గత ఏడాది విడుదలైన రాజశేఖర్ పిఎస్వి గరుడావెగ చిత్రంలో ఐటెం సాంగ్ లో మెరిసి అలరించిన సంగతి తెలిసిందే.

 భారీ పీరియాడిక్ చిత్రం

భారీ పీరియాడిక్ చిత్రం

వీరమహాదేవి పేరుతో 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ చిత్రం రూపొందుతోంది. వడివుడయాన్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 యుద్ధం కోసం ట్రైనింగ్

యుద్ధం కోసం ట్రైనింగ్

ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీ కోసం సన్నీలియోన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది.

పవన్ కళ్యాణ్ ఫోజులో కిరాక్

తాజగా సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోజు చూస్తే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గుర్తుకు రాక మానడు. కరాటే స్టంట్ చూపిస్తూ ఇటుకలని పగలగొడుతున్న సన్నిలియోన్ ఫోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Sunny Leyone stunning look in Pawan Kalyan style goes vairal in social media. Sunny Leone's crazy project Veera mahaaDevi Begins.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu