»   »  సన్నిలియోన్ చెప్పే విషయాలు వింటే ఆశ్చర్య పోతారు ... ఆటోబయోపిక్ కి సిద్దమైన సన్నీ

సన్నిలియోన్ చెప్పే విషయాలు వింటే ఆశ్చర్య పోతారు ... ఆటోబయోపిక్ కి సిద్దమైన సన్నీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నిలియోన్ నిర్మాతగా మారనుందనే సంగతి విన్నదే కదా. అయితే ఇప్పుడు సన్నీ తీయ బోయే కథ ఒక బయో పిక్ అట. అదీ ఎవరిదో కాదు తనదే. అవును సన్నీ తన సొంత జీవితాన్నే కథ గా తెరకెక్కించే ప్రయత్నం మొదలు పెట్టిందత.అంటే ఆటో బయో గ్రఫీ లాగ... ఆటో బయో పిక్ అన్న మాట. ఇంతకీ ఇప్పుడు సన్నీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందీ అంటే "మోస్ట్ లీ సన్నీ" పేరుతో దర్శకుడు దిలీప్ మెహతా తీసిన డాక్యుమెంటరీలో తను చెప్పిన విషయాలతో కాకుండా ఎవరివో అభిప్రాయాలని కలిపి ఆ సినిమా తీసాడన్నది సన్నీ ఆరోపణ.

అందుకే తన జీవితాన్ని తెరకెక్కించటానికి తానే సరైన మనిషి అనుకున్న సన్నీ ఇప్పుడు తానే తన చిత్రాన్ని నిర్మించే పనిలో పడింది. ఈసారి తన జీవితం ఏ ఏ మలుపులు తిరిగిందో, ఎందువల్ల తాను పోర్న్ స్టార్ గా మారాల్సి వచ్చిందో.., తన భర్త తో ఉన్న అనుబందం గురించీ... ఇలా అన్ని విశయాలనీ ఈసారి తన వైపునుంచే నిజాయితీగా చెప్పనుందట.

 నా కథ నేనే చెప్పాలి

నా కథ నేనే చెప్పాలి


ఈ సినిమా కోసం నిర్మాతగా కూడా మారుతున్న సన్నీ "ఈ ప్రపంచంలో నా జీవిత కథను ఎలా తీయాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు.. ఇది పూర్తిగా నా జీవితం.. నా కథ నేనే చెప్పాలి" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సన్నీ లియోన్ తన జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాతో నిర్మాతగా మారుతోంది. తాను తీయబోయే సినిమా గురించి మరికొన్ని విశేషాలు...

 దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు

దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు


ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న క్రేజ్, హీరోయిన్స్‌కి కూడా లేదనే చెప్పాలి. బాలివుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ ఫీమేల్ స్టార్ గా మంచి పొజిషన్ లోనే ఉంది. ఇటీవల గూగుల్ సర్వేలో సల్మాన్, షారూఖ్, మోదీ వంటి ప్రముఖులను దాటేసి నెంబర్ వన్ సెలబ్రిటీగా నిలబడింది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు సన్నీ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో .

కుటుంబ ప‌రిస్థితిలు

కుటుంబ ప‌రిస్థితిలు

స‌న్నీలియోన్ బాలీవుడ్ సినిమాల్లోకి రాక‌ముందు పోర్న్ స్టార్ గా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తుంపు ద‌క్కించుకుంది. నాటి ఆమె కుటుంబ ప‌రిస్థితిలు, వ్య‌క్తిగ‌త కారాణ‌ాల వ‌ల్ల ఆమెను కాలం పోర్న్ సినిమాల‌వైపు ట‌ర్న్ తీసుకునేలా చేసింది. నేడు బాలీవుడ్ లో స్టార్ గా కొన‌సాగుతుందంటే ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. మ‌రెన్నో అవ‌మానాలు ఎదుర్కుంది.

 జిస్మ్ -2

జిస్మ్ -2


లా సాగిపోతున్న జీవితంలో స‌ల్మాన్ ఖాన్ ప్ర‌వేశించి బాలీవుడ్ రియాల్టీ షో ‘బిగ్ బాస్'లో అవ‌కాశం క‌ల్పించాడు. దీంతో ఆమె లైఫ్ ఒక్క‌సారిగా ట‌ర్న్ అయిపోయింది.జిస్మ్ -2 చిత్రంలో తొలిసారి బోల్డ్ గా న‌టించి బాలీవుడ్ తెర‌పై త‌న ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. త‌ర్వాత చిన్న చిన్న పాత్ర‌లు చేసుకుంటూ వ‌చ్చి నేడు స్టార్ హీరోయిన్ గా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను చాటుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బ‌యోపిక్ ట్రెండ్ బాగా కొన‌సాగుతుంది కాబ‌ట్టి స‌న్నీ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాల‌ని త‌న జీవితాన్ని వెండి తెర‌కు ఎక్కించే ప్ర‌య‌త్నాలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నం లో భాగంగానే "మోస్ట్ లీ సన్నీ" నిర్మాణం మొదలయ్యింది.

 కేసులు పెట్టారు

కేసులు పెట్టారు


పోర్న్ స్టార్ స్టేజ్ నుంచి బాలీవుడ్ హాట్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన సన్నీ లియోన్ తన ఇమేజ్ తో పాటు విమర్శలను కూడా అదే స్థాయిలో కొనితెచ్చుకుంది... ఏదో ఓ కారణంతో సన్నీలియోన్ పై దేశవ్యాప్తంగా ఎంతోమంది కేసులు పెట్టారు. ఈ సెక్సీ బ్యూటీపై ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పడం చాలా కష్టం... ఎన్ని విమర్శలూ.., పోర్న్ స్టార్ అంటూ ఎన్ని అవమానాలు ఎదురైనా... భరించింది సన్నీ.

 బంపర్‌ ఆఫర్‌

బంపర్‌ ఆఫర్‌


ఇప్పుడు ఆమెని దాదాపుగా అందరూ అంగీకరించినట్టే... ఆమెనీ మామూలుగా నటిగానే చూస్తున్నారు. పోర్న్‌స్టార్‌గా అడుగుపెట్టినా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది సన్నీలియోన్‌. సన్నీ ఈ స్థాయికి రావడానికి కారణం ఆమె అదృష్టమే అంటారు ఆమె సన్నిహితులు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో వరుసగా జతకడుతున్న సన్నీకి మరో బంపర్‌ ఆఫర్‌ దక్కింది. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందింది.

 మోస్ట్ లీ సన్నీ

మోస్ట్ లీ సన్నీ


సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా "మోస్ట్ లీ సన్నీ" పేరుతో దర్శకుడు దిలీప్ మెహతా తీసిన డాక్యుమెంటరీలో తన భర్త డేనియల్ వెబర్ తో కలసి సన్నీ నటించింది. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడింది.అయితే.. ఈ చిత్ర ప్రదర్శనకు సన్నీ గైర్హాజరయ్యింది.

 వాళ్ల ఇష్టానికి కథ

వాళ్ల ఇష్టానికి కథ


అది తన కథ కాదని ఎవరి అభిప్రాయాన్నో డాక్యుమెంటరీగా తీశారని.. దర్శకుడి విజన్ కి అనుగుణంగా నిజాయితీగా నటించానని.. కానీ వాళ్ల ఇష్టానికి కథ మార్చారని.. ఆ డాక్యుమెంటరీ ఇండియాలో విడుదల కాకూడదని కోరుకుంటున్నా అని సన్నీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలా తన కథను ఎవరు బడితే వారు తమకు తోచినట్లు మార్చేస్తున్నారని భావించిన సన్నీ ప్రపంచానికి తప్పుడు కథ చూపించకూడదని తన బయోపిక్ కి తానే నిర్మిస్తుంది.

 కరన్ జీత్ కౌర్ ఓరా

కరన్ జీత్ కౌర్ ఓరా


కెనడాలోని ఒక సిక్కు కుటుంబంలో కరన్ జీత్ కౌర్ ఓరాగా జన్మించి తరువాత సన్నీ లియోన్ గా పేరు మార్చుకుని పోర్న్ ఇండస్ట్రీలో టాప్ పేయింగ్ నటిగా ఎదిగిన క్రమమంతా ఈ డాక్యుమెంటరీలో ఉందట. అయితే ఈ చిత్రం తను అనుకున్నట్టుగా తెరకెక్కలేదని సన్నీ అంటోంది. తనకు సంబంధం లేని చాలా ఘటనలు ఉన్నాయని చెబుతోంది. తన వ్యక్తిగత జీవితం గురించి తనకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందని చెబుతోంది.

 ఇది నా జీవితం కాదు

ఇది నా జీవితం కాదు


‘నా జీవితంపై వచ్చే చిత్రాన్ని నా స్నేహితులూ బంధువులూ మధ్య కూర్చుని చూసేదిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ అందుకు భిన్నంగా ఉంది. నేను వద్దనుకున్న చాలా విషయాలు దాన్లో ఉన్నాయి. చూడొద్దనుకున్న ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. ఇది నా జీవితం కాదు. నా జీవితం మీద ఇంకొకరి అభిప్రాయం మాత్రమే ఇది' అని అభిప్రాయ పడ్ద సన్ని ఇక వాళ్ళూ వెళ్లతో లాభం లేదనుకొని తానే స్వయంగా రంగం లోకి దిగింది. ఎవరి ఆత్మ కథని వారు రాసుకుంటే దాన్ని ఆటో బయోగ్రఫీ అన్నట్టే ఇప్పుడు సన్నీ స్వయంగా తెరకెక్కిస్తున్న సినిమాని ఆటో బయోపిక్ అనొచ్చా..??

English summary
Sunny and husband Daniel Weber are now gearing up to get into production. And they’ve already have their first venture in mind I- it’s a biopic on Sunny herself., The scripting of the film has begun in full swing and Sunny is now on the lookout for an eligible director to helm it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu