»   » ‘సూపర్‌ కౌబాయ్’ ఆడియోను ఆవిష్కరించిన ‘సూపర్' హీరో

‘సూపర్‌ కౌబాయ్’ ఆడియోను ఆవిష్కరించిన ‘సూపర్' హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌, సంగీత దర్శకుడు రాఘవ లారెన్స్‌ కథానాయకుడుగా లక్ష్మీరాయ్‌, పద్మప్రియ, సంధ్య హీరోయిన్‌లుగా ఎ.జి.యస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై శింబుదేవన్‌ దర్శకత్వంలో కల్పాతి యస్‌.అగోరం సమర్పణలో నిర్మిస్తున్న 'సూపర్‌ కౌబాయ్‌" చిత్రం ఆడియో వేడుక ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని పాటల సిడిని హీరో నాగార్జున ఆవిష్కరించి తొలి సిడిని చిత్ర కథానాయకుడు రాఘవ లారెన్స్‌కు అందజేసారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ''చిన్నప్పటి నుంచి 'కౌబాయ్‌" చిత్రాలు చూస్తూనే వున్నాం. కాని ఈ సినిమా ఎందుకో చాలా కొత్తగా వుంటుంది అనిపిస్తోంది. లారెన్స్‌ గురించి చాలా మందికి తెలియనివి నాకు తెలుసు. లారెన్స్‌ సంపాదించినదంతా ఏమి చేస్తాడో నాకు 'మాస్‌" సమయంలో తెలిసింది. అతని సంపాదన అనాధ పిల్లల కోసం ఖర్చు చేస్తాడు. లారెన్స్‌కు అనాథలంటే అంత మక్కువ. అందుకే అతని ప్రతి చిత్రంలో అనాధ పాత్ర కచ్చితంగా వుంటుంది. అంత మంచి మనిషి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మంచి మ్యూజిక్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను"" అన్నారు. చిత్ర కథానాయకుడు రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ "నాగార్జున గారు చాలా గొప్ప మనసు కలిగిన వ్యక్తి. ఆయనకు ఎప్పుడు ఫోన్‌ చేసినా చాలా ఆప్యాయంగా మాట్లాడుతారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. నాగార్జునగారంటే నాకు కొంచెం సెంటిమెంట్‌ వుంది. 'మాస్‌" ఎంత హిట్టో అందరికీ తెలుసు.

ఆ తరువాత 'స్టైల్‌"లో వున్నారు. ఆ సినిమా హిట్టు, అలాగే 'ముని" చిత్రం ఆడియో నాగార్జునగారే ఆవిష్కరించారు ఆ సినిమా హిట్టు. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో ఆయన చేతుల మీదుగా జరిగింది. కాబట్టి ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్టవుతుంది. ఈ సినిమాలో నటించిన వారంతా ఎంజాయ్‌ చేస్తూ నటించారు ఒక్క దర్శకుడు తప్ప. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచించి ఒక గొప్ప చిత్రంగా మలిచారు. జివి మంచి సంగీతం ఇచ్చారు" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎజియస్‌ ఇయఫ్‌ఒ ఆర్‌.రంగరాజన్‌, చిత్ర దర్శకుడు శింబుదేవన్‌, నటులు సాయికుమార్‌, నాజర్‌, కథానాయికలు లక్ష్మీరాయ్‌, పద్మప్రియ, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌, రచయితలు రామకృష్ణ, వనమాలి, విజయ్‌ శంకర్‌, జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu