»   » చాకలి పాత్రలో చెలరేగిన సూపర్ స్టార్

చాకలి పాత్రలో చెలరేగిన సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్ ఖాన్ తాజాగా ధోబి(చాకలి) గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ కి సంభందించిన ఓ యాడ్ ఫిల్మ్ కోసం ఆయన ఈ అవతారమెత్తారు. నిన్న(మంగళవారం) ఈ షూటింగ్ ముంబయిలోని కెంప్స్‌ కార్నర్ ‌లో జరిగింది. యూరప్ ‌లో వేసవి సెలవులు గడిపి తిరిగొచ్చిన అమీర్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ధోబీ గెటప్ లోని పంచెకట్టు, హెయిర్ కట్టింగ్, మీసకట్టు అచ్చం హిందూస్ధానీ ధోబీనే తలపిస్తున్నాడంటూ బాలీవుడ్ మొత్తం మొచ్చుకుంటోంది. ఇక ఈ గెటప్ వేయటం వేయటం వెనక ఓ సీక్రెట్ ఉందంటున్నారు సీనియర్స్. తన భార్య కిరణ్ దర్శకత్వంలో రూపొందనున్న ధోభీగాట్ చిత్రం ప్రమోషన్ కోసం ఈయన ఇలా కనిపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. అటు యాడ్ పిలిం చేసినట్లూ ఉంటుంది. మరో ప్రక్క తన భార్య చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లు ఉంటుందనేది అమీర్ ఆలోచన అని వివరిస్తున్నారు. ఇక ఇలాంటి గెటప్ లు వేయటం అమీర్ కి కొత్తేమీ కాదు. ఇంతకు ముందు సగ భాగం ఆడ...మరో సగ భాగం మగ వేషంలో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu