»   » సూపర్ స్టార్ కిడ్నాప్‌ ఆడియో వేడుకలో రఘువీరారెడ్డి కూడా..(ఫోటోలు)

సూపర్ స్టార్ కిడ్నాప్‌ ఆడియో వేడుకలో రఘువీరారెడ్డి కూడా..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లక్కీ క్కియేషన్స్ బ్యానర్‌పై ఎ.సత్తిరెడ్డి సత్తిరెడ్డి సమర్పణలో నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధా దాస్ నటీనటులుగా తెరకెక్కుతోన్న 'సూపర్ స్టార్ కిడ్నాప్' చిత్రం ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కన్నడ నటుడు సుదీప్, రానా, శ్రీకాంత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ చిత్రాన్ని చందు పెన్మత్స నిర్మిస్తున్నారు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆడియో వేడక కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

రఘువీరారెడ్డి

రఘువీరారెడ్డి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ‘సూపర్ స్టార్ కిడ్నాప్' ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

ప్రముఖులు హాజరయ్యారు

ప్రముఖులు హాజరయ్యారు

శ్రీకాంత్, సుదీప్, రానా, నాని, నిఖిల్, వరుణ్ సందేశ్, తనీష్, ప్రిన్స్, ఖయ్యుమ్, రమేష్ పుప్పాల, విక్రమ్ గౌడ్, శ్రీనివాస్ అవసరాల, బెక్కం వేణుగోపాల్, సురేష్ కొండటి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

నాని మాట్లాడుతూ...

నాని మాట్లాడుతూ...

ఈ సినిమా గురించి నాకు ముందే తెలుసు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కామెడీ మూవీ. తెలుగులో వస్తున్న అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ. నేను, మనోజ్, అల్లరి నరేష్, ప్రిన్స్ ఇలా ఎనిమిది మంది హీరోలు కలిసి ఇందులో నటించారని తెలిపారు.

సుదీప్ మాట్లాడుతూ...

సుదీప్ మాట్లాడుతూ...

కన్నడ నటుడు సుదీప్ మాట్లాడుతూ...చిత్రం టీంను అభినందించారు. సినిమా హిట్ కావాలని ఆకాక్షించారు.

నటీనటులు

నటీనటులు

నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధా దాస్ నటీనటులుగా తెరకెక్కుతోంది ‘సూపర్ స్టార్ కిడ్నాప్'.

రానా, శ్రద్ధా దాస్

రానా, శ్రద్ధా దాస్

సూపర్ స్టార్ కిడ్నాప్ ఆడియో వేడుక సందర్భంగా శ్రద్ధా దాస్, రానా ఇలా కరచాలనం చేసుకున్నారు.

మహేష్ బాబు పేరుతో..

మహేష్ బాబు పేరుతో..

ఈ చిత్రం మహేష్ బాబును కిడ్నాప్ చేయడం అనే కథాంశంతో సాగుతుంది.

English summary
Super Star Kidnap Music Launch held at Hyderabad. Superstar Kidnap is a crime comedy movie which is getting ready for its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu