»   » మహేష్ బాబుదే నెం.1 అంటున్న సూపర్ స్టార్ కృష్ణ!

మహేష్ బాబుదే నెం.1 అంటున్న సూపర్ స్టార్ కృష్ణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా పి.వి.పి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టెనర్ ‘బ్రహ్మోత్సవం'. నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను జనవరి 1న విడుదల చేసారు. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ టీజర్ గురించి సూపర్ స్టార్ కృష్ణ స్పందిస్తూ....‘బ్రహ్మోత్సవం టీజర్ చూసాను. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. మహేష్ చేసిన సినిమాలన్నింటికంటే ఈ సినిమాలో చాలా బావున్నాడు. టీజర్ చూస్తుంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అనే విషయం ఎస్టాబ్లిష్ అయింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుందని చెప్పారు. సమ్మర్ సినిమాల్లో ‘బ్రహ్మోత్సవం' నెంబర్ వన్ సినిమాగా నిలబడుతుందని, నిలబడాలని ఆశిస్తున్నాను' అన్నారు.

SUPER STAR KRISHNA about BRAHMOTSAVAM teaser

మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణ భగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, డాన్స్: రాజుసుందరం, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ గుణ్ణం, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

English summary
SUPER STAR KRISHNA about BRAHMOTSAVAM teaser.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu