»   » ఆయనకు కూతురుకావటమే నాకు అడ్డుగోడ: మహేష్ బాబు సోదరి అలా ఎందుకన్నారు

ఆయనకు కూతురుకావటమే నాకు అడ్డుగోడ: మహేష్ బాబు సోదరి అలా ఎందుకన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

షో లాంటి భిన్నమైన చిత్రంతో జాతీయ అవార్డు కూడా గెల్చుకొన్న మంజుల- కావ్యాస్ డైరీ.. ఆరెంజ్ తో పాటు కొన్ని తమిళ్.. మలయాళం మూవీస్ లోనూ యాక్ట్ చేసింది. అయితే నిర్మాతగా కొన్ని ఫెయిల్యూర్స్ ను చవిచూడాల్సి వచ్చింది. దీంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న మంజుల సడెన్ గా ఒక్కసారి మళ్ళీ వెలుగులోకి వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణ కూతురుగా పుట్టడం అడ్డుగా తన కలలు నెరవేర్చుకోవటానికి అడ్డుగోడలా మారింది అంటూ అమె కొన్ని వ్యాఖ్యలు చేసారు.

మహిళా దినోత్సవం

మహిళా దినోత్సవం

నిన్న ‘మహిళా దినోత్సవం' సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మంజుల ఆసక్తికర సంగతులు వెల్లడించారు. "నేను హీరోయిన్ గా ఎదగాలని కలలు కన్నాను. ఆ కల నెరవేర్చుకోవడానికి కృష్ణ కూతురుగా పుట్టడం అడ్డుగా మారింది" అని మంజుల చెప్పారు.

సూపర్ స్టార్ కి కుమార్తె

సూపర్ స్టార్ కి కుమార్తె

ఒక సూపర్ స్టార్ కి కుమార్తె, మరో సూపర్ స్టార్ కి సోదరి ఘట్టమనేని వారసురాలు మంజుల చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. నటిగానూ గుర్తింపు తెచ్చుకొని 'షో' లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అంత పెద్ద స్టార్ డాటర్ అయిఉండి కూడా ఆ సినిమాని తీయటానికి చాలానే సమస్యలని ఎదుర్కొన్నారామె.

రహస్యంగా ఉంచాల్సి వచ్చింది

రహస్యంగా ఉంచాల్సి వచ్చింది

జాతీయ అవార్ద్ సినిమా అయినా రిలీజ్ అయ్యే వరకూ ఆ సినిమా సంగతి రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే కృష్ణ అభిమానులు మంజులని కూడా తమ ఇంటి అమ్మాయిగానే భావించారు. ఆమె సినిమాల్లో గ్లామర్ గా కనిపిస్తుందేమోనన్న భాదతో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవ్వకూడదంటూ బలంగా వ్యతిరేకించారు.

ఆత్మహత్యలకి కూడా

ఆత్మహత్యలకి కూడా

హీరోయిన్ గా అరంగేట్రం చేయిస్తున్నారు అనే వార్తలు చూసి సూపర్ స్టార్ ఫాన్స్ ఆత్మహత్యలకి కూడా ఒడిగట్టిన రోజులు ఉన్నాయి. ఆ రియాక్షన్ చూసి కృష్ణ ఆ ఆలోచన మానుకున్నారు. దాంతో నటి అవ్వాలనుకున్న మంజుల ఆశలు అక్కడితో ముగిసిపోయాయ్, అదే కొడుకు హీరో అవుతూంటే మాత్రం అదే అభిమానులు స్వాగతించటం గమనార్హం

టాప్ హీరోయిన్ గా

టాప్ హీరోయిన్ గా

చాలా కాలం తర్వాత ఆవిషయాలను గుర్తు చేసుకున్న మంజుల తాను అనుకుని ఉంటే వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఒక టాప్ హీరోయిన్ గా పేరు తెచుకునేదాన్నని గతాన్ని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకూడదనే హీరోయిన్ ఛాన్స్ వదులుకున్నట్లు పేర్కొన్నారు. ఆ విషయంలో ఎప్పుడూ తాను బాధ పడలేదని మంజుల స్పష్టం చేశారు.

తన కూతురు జాన్వీ

తన కూతురు జాన్వీ

అయితే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. పెద్ద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి వచ్చి ధైర్యంగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇంకో సంగతి కూడా చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చే మూవీలో తన కూతురు జాన్వీ ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Manjula Who is a doughter of a Superstar and sister of anether Super star is Shared Her feelings about Women discrimination on women's Day
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu